ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పీడ్‌ పెంచిన మెట్రో

ABN, First Publish Date - 2023-01-30T00:24:42+05:30

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ సర్వే పనులు చురుగ్గా సాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చురుగ్గా ఎయిర్‌పోర్టు కారిడార్‌ పనులు

తాజాగా మరోసారి సర్వే

హైదరాబాద్‌ సిటీ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ సర్వే పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు జనరల్‌ కన్సల్టెన్సీ (జీసీ)లను నియమించేందుకు బిడ్లను ఆహ్వానించిన హైదరాబాద్‌ ఎయుర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) అధికారులు ట్రాక్‌ నిర్మాణానికి సంబంధించిన సర్వేను ముమ్మరం చేశారు. 15 రోజుల క్రితం రాయదుర్గం రహేజా మైండ్‌ స్పేస్‌ నుంచి శంషాబాద్‌ సమీపం వరకు 21 కిలోమీటర్ల వరకు సర్వే చేపట్టారు. తాజాగా ఆదివారం మరోసారి హెచ్‌ఏఎంఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్టు మేనేజర్‌ ఆనంద్‌మోహన్‌, జనరల్‌ మేనేజర్లు విష్ణువర్ధన్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్‌నాయక్‌, ఎస్‌ఈ సాయపురెడ్డి, డీఎస్‌పీ కె.శ్రీనాథ్‌రెడ్డితోపాటు పలువురు సీనియర్‌ అధికారులు అలైన్‌మెంట్‌, స్టేషన్‌ స్థానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నార్సింగి అండర్‌పాస్‌ (మై హోమ్‌ అవతార్‌ జంక్షన్‌) నుంచి రాజేంద్రనగర్‌ గుట్ట వరకు అలైన్‌మెంట్‌లోని ప్రతీ అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ మెట్రో అలైన్‌మెంట్‌ కోసం ప్రైవేట్‌ ఆస్తుల సేకరణను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలనీలు, రోడ్లపై నుంచి ప్రయాణికులు స్లేషన్లకు సులువుగా చేరుకునేందుకు ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) అండర్‌పా్‌సలను ఉపయోగించుకునేందుకు వీలుగా స్టేషన్ల స్థానాలను నిర్ణయించాలని సూచించారు. భవిష్యత్‌లో అదనపు స్టేషన్ల నిర్మాణం కోసం గుర్తించిన ప్రదేశాల్లో గ్రేడియంట్లు లేకుండానే మెట్రో వయాడక్ట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఎయిర్‌పోర్టు మెట్రోని మొదటి రోజు నుంచే విజయవంతం చేసే విధంగా స్కైవాక్‌లు, పాదచారుల సౌకర్యాలు ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండాలన్నారు. మెట్రో పిల్లర్లు నానక్‌రామ్‌గూడ జంక్షన్‌ నుంచి తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ (టీఎ్‌సపీఏ) జంక్షన్‌ వరకు విస్తరించిన సర్వీస్‌ రోడ్డులోని సెంట్రల్‌ మీడియన్‌లో ఉండాలని, తద్వారా ట్రాఫిక్‌కు ఇబ్బందులుండవని చెప్పారు. స్టేషన్ల యాక్సెస్‌ పాయింట్లు కొత్తగా ఏర్పాటు చేయనున్న సైకిల్‌ ట్రాక్‌కు అనుగుణంగా ఉండాలన్నారు. ప్రాజెక్టును మరింత వేగవంతం చేసేందుకు తాత్కాలిక కాస్టింగ్‌ యార్డుల కోసం కారిడార్‌ సమీపంలో ప్రభుత్వ భూములను గుర్తించాలని చెప్పారు.

జీసీల ఎంపిక పూర్తి

ఎయుర్‌పోర్టు మెట్రో కారిడార్‌ నిర్మాణానికి సంబంధించి జనరల్‌ కన్సల్టెన్సీ (జీసీ)ల ఎంపిక దాదాపుగా పూర్తికావచ్చింది. ప్రాజెక్టును చేపట్టేందుకు దేశ, విదేశాలకు చెందిన 13 జాతీయ, అంతర్జాతీయ ఇంజనీరింగ్‌ కన్సల్టెన్సీ కంపెనీలతో కూడిన ఐదు కన్సార్షియంలు జనరల్‌ కన్సల్టెన్సీ బిడ్లలో పాల్గొనేందుకు ఇటీవల అర్హత సాధించాయి. ఎంపిక చేసిన సంస్థల ద్వారా పనులను సకాలంలో ప్రారంభించాలని హెచ్‌ఏఎంఎల్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రూ.6,250 కోట్లతో 31 కిలోమీటర్ల మార్గంలో నిర్మించనున్న మెట్రో ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతేడాది డిసెంబర్‌ 9న భూమి పూజ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-01-30T00:24:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising