ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: మహిళల వాస్త్రధారణపై హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

ABN, First Publish Date - 2023-06-18T10:12:22+05:30

హైదరాబాద్: తెలంగాణ హోంమంత్రి మహమూద్ ఆలీ మహిళల దుస్తులపై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవచ్చు.. ఎలాంటివి వేసుకోకూడదనే అంశంపై హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ హోంమంత్రి (Home Minister) మహమూద్ ఆలీ (Mahmood Ali) మహిళల దుస్తులపై (Womens Dresses) చేసిన కామెంట్స్ (Comments) దుమారం రేపుతున్నాయి. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవచ్చు.. ఎలాంటివి వేసుకోకూడదనే అంశంపై హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. మహిళలు తమకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చని కానీ యూరోపియన్ల తరహాలో పొట్టి దుస్తులు వేసుకోకూడదంటూ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పొట్టి దస్తులు వేసుకునే మహిళలు ఇబ్బందులపాలవుతారని, నిండుగా బట్టలు వేసుకుంటే హాయిగా ఉండవచ్చునని అన్నారు.

ఎవరికి నచ్చిన దుస్తులు వాళ్లు వేసుకోవడం తప్పులేదన్న హోంమంత్రి హిందూ మహిళలు లానే ముస్లిం మహిళలు (Muslim womens) కూడా వీలైనంతవరకు శరీరాన్నికప్పి ఉంచే దస్తులు వేసుకోవడం మంచిదని అన్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లువెత్తాయి. శుక్రవారం హైదరాబాద్ సంతోష్‌నగర్‌లోని కేవీ రంగారెడ్డి మహిళా కాలేజీలో (KV Rangareddy Womens College) ఉర్దూ పరీక్ష రాయడానికి వెళ్లిన విద్యార్థినిలను బురఖాలు తీసివేయాలని ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు చెప్పారు. బురఖాలు తీసిన తర్వాతే తమను పరీక్ష హాలులోకి అనుమతించినట్లుగా మీడియా దృష్టికి తెచ్చారు. దీనిపై హోంమంత్రి స్పందించిన తీరు వివాదానికి దారి తీసింది.

ఏబీఎన్ డిజిటల్ ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ రేవతి మాట్లాడుతూ...

హోంమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన ఏబీఎన్ డిజిటల్ ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ రేవతి (ABN Digital Executive Editor Revathi) మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా.. రేప్ కేస్ కానీ ఇంకొటి అయినా మహిళల దుస్తులపైనే చర్చ జరుగుతుంటుందని అన్నారు. దీనిపై హోంమంత్రి మాట్లాడుతుంటే ఆయన వెనుక ఉన్నవాళ్లంతా నవ్వుతున్నారని.. అంటే ఎంత వెటకారంగా మాట్లాడుతున్నారో అర్థమవుతోందన్నారు. ఎగ్జామ్ హాలులో తమ బురఖాలు తీయించేశారన్న దానికి.. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలన్నదానికి సంబంధం లేకుండా మాట్లాడారన్నారు. హోంమంత్రి వ్యాఖ్యలపై ఇంత దుమారం రేపుతుంటే పార్టీ నుంచి గానీ, హోంమంత్రి నుంచి గానీ ఎలాంటి స్పందన లేదని విమర్శించారు.

ఇంతకుముందు రాజయ్య, తాజాగా దుర్గం చిన్నయ్యలపై ఎన్నో విమర్శలు వచ్చాయని రేవతి అన్నారు. రాజకీయ నేతల వ్యాఖ్యలపై పార్టీ నుంచి ఒక స్టేట్‌మెంట్ రాకపోవడం తప్పేనని అన్నారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి మహమూద్ ఆలీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె అన్నారు. ఆ మధ్య ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై పోరాటం చేశారని కొనియాడారు. అలాగే మహిళలను విమర్శిస్తూ స్టేట్‌మెంట్లు వచ్చినప్పుడు పార్టీ వెంటనే స్పందించి.. ఇది తప్పని ఒక స్టేట్‌మెంట్ విడుదల చేయాలన్నారు. వారితో క్షమాపణ చెప్పించాలని రేవతి డిమాండ్ చేశారు.

Updated Date - 2023-06-18T10:12:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising