ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: 30 వేల ఓటరు కార్డులు తిరిగొచ్చాయి.. ఇంకో 40 వేలు తిరిగొస్తాయి.. ఎందుకో తెలుసా ?..

ABN, First Publish Date - 2023-03-11T16:42:16+05:30

తపాలశాఖ(Postal Department) ద్వారా జీహెచ్‌ఎంసీ(GHMC) పంపిన ఓటరు గుర్తింపుకార్డుల్లో(Voter ID Card) 25 శాతానికిపైగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): తపాలశాఖ(Postal Department) ద్వారా జీహెచ్‌ఎంసీ(GHMC) పంపిన ఓటరు గుర్తింపుకార్డుల్లో(Voter ID Card) 25 శాతానికిపైగా తిరిగి వచ్చాయి. నమోదు సమయంలో పేర్కొన్న చిరునామా(Address)లో ఓటర్లు లేకపోవడమే ఇందుకు కారణమని తపాలాశాఖ అధికారులు చెబుతున్నారు. 2021 నుంచి మొన్నటి జనవరి వరకు పేర్లు నమోదు చేసుకున్న ఓటర్లకు దశల వారీగా పోస్టులో గుర్తింపు కార్డులను పంపుతున్నారు. రెండేళ్లలో 2.99 లక్షల ఓటర్ల పేర్లు నమోదు చేసుకోగా అన్ని కార్డులు తపాలశాఖకు అప్పగించామని పేర్కొన్నారు. అక్కడి నుంచి విడతల వారీగా ఓటర్ల చిరునామాకు పంపుతున్నారని చెప్పారు.

ఈ క్రమంలో ఇప్పటి వరకు పంపిన కార్డుల్లో 30 వేల కార్డులు జీహెచ్‌ఎంసీ(GHMC) కేంద్ర కార్యాలయానికి తిరిగి రాగా.. ప్రస్తుత పరిస్థితిని చూస్తే..మరో 40 వేల కార్డులు వచ్చే అవకాశముందని ఎన్నికల విభాగం వర్గాలు చెబుతున్నాయి. గతంలో కొత్తగా నమోదు చేసుకున్న, పొగొట్టుకున్న పాత కార్డులు నిర్ణీత రుసుము చెల్లించి మీ సేవా కేంద్రాల్లో తీసుకునేవారు. ఈ విధానానికి కేంద్ర ఎన్నికల సంఘం స్వస్తి పలికింది. రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఎంపిక చేసిన ఏజెన్సీలు ముద్రించే కార్డులను తపాలశాఖ ద్వారా ఓటర్లకు పంపాలని నిర్ణయించారు. రెండు నెలల క్రితం కార్డుల ముద్రణ పూర్తికాగా.. పోస్టల్‌ ద్వారా పంపుతున్నారు.

చిరునామాలో లేక..

నగరంలో మెజార్టీ పౌరులు అద్దె ఇళ్లలో నివసిస్తుంటారు. ఉద్యోగం, పిల్లల చదువు, ఇతరత్రా కారాణాలతో ఒక్కో ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారాల్సి వస్తుంది. ఓటరు గుర్తింపు కార్డులు తిరిగి రావడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. కార్డులో పేర్కొన్న చిరునామాలో సంబంధిత వ్యక్తులు లేకపోవడంతో తపాలశాఖ వాటిని తిరిగి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి పంపుతోంది.

తపాలా శాఖ వైఫల్యం?

కార్డులు పంపించడంలో తపాలాశాఖ వైఫల్యమూ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలా ప్రాంతాల్లో ఆ శాఖ సిబ్బంది ఇళ్ల వద్దకు కార్డులు తీసుకెళ్లకుండానే వెనక్కి పంపుతోన్నట్టు ఆరోపణలున్నాయి. పోస్టులో వచ్చిన సాధారణ ఆర్డర్లనే కొందరు పోస్ట్‌మన్‌లు సంబంధిత వ్యక్తులకు అందజేయడంలో నిర్లక్ష్యం చూపుతారు. నాలుగైదు సార్లు ఫోన్‌ చేసినా స్పందించే పరిస్థితి ఉండదు. దీంతో పౌరులు ఫోస్టాఫీసుకు వెళ్లి తమ పేరిట వచ్చిన వస్తువులు తీసుకుంటారు. ఇక వేల సంఖ్యలో ఓటరు గుర్తింపు కార్డులు ఉండడంతో..కొందరు పోస్టుమెన్లు వాటిని పౌరులకు అందజేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తపాలాశాఖలో పోస్టల్‌ ఆర్డర్లకు సంబంధించి ట్రాకింగ్‌ వ్యవస్థ అందుబాటులో ఉన్నా సరిగా పని చేయడంలేదు. దీంతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొంది.

Updated Date - 2023-03-11T17:39:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising