ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad Metro: ఉద్యోగుల సమ్మెపై హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజ్‌మెంట్ కీలక ప్రకటన..

ABN, First Publish Date - 2023-01-03T16:36:29+05:30

మెట్రో రైల్ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తూ ఉద్యోగులు సమ్మె చేపట్టడంపై హైదరాబాద్ మెట్రో రైలు (HMR) మేనేజ్‌మెంట్ స్పందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మెట్రో రైల్ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తూ ఉద్యోగులు సమ్మె చేపట్టడంపై హైదరాబాద్ మెట్రో రైలు (HMR) మేనేజ్‌మెంట్ స్పందించింది. కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీ కింద పనిచేస్తున్న కొంతమంది టిక్కెటింగ్‌ సిబ్బంది సహేతుకం కానప్పటికీ విధులకు దూరంగా ఉండి ప్రయాణీకులకు అసౌకర్యాన్ని కలిగించారని హెచ్చరించింది. మెట్రో రైల్‌ కార్యకలాపాలకు అవాంతరాలను కలిగించే ఉద్దేశ్యంతోనే సమ్మెకు దిగినట్టు పేర్కొంది. తమ స్వార్థ ప్రయోజనం కోసం తప్పుడు సమాచారం, పుకార్లను సైతం వ్యాప్తిచేస్తున్నారని వెల్లడించింది. సమ్మెపై వాదనలు తప్పని తెలిపింది. ఉద్యోగుల చర్యలు ప్రజా ప్రయోజనాలకు పూర్తి విరుద్ధమైనవని, వారిపై కఠిన చర్యలను తీసుకోవాల్సిందిగా హెచ్‌ఎంఆర్‌ మేనేజ్‌మెంట్‌ కోరుతోందని వెల్లడించింది. సిబ్బందికి తగిన వసతులు, ప్రయోజనాలను మేనేజ్‌మెంట్‌ అందిస్తుందని, అయితే, వారు మరింతగా ఏమి కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు తగిన చర్చలు జరుపనున్నట్టు మేనేజ్‌మెంట్ వెల్లడించింది. రైలు కార్యకలాపాలు నిర్ధేశిత సమయానికే నడుస్తున్నాయని, తగిన సిబ్బంది కూడా పూర్తిగా అందుబాటులో ఉన్నారని ఒక ప్రకటన విడుదల చేసింది.

హైదరాబాద్ మెట్రోపై సమ్మె ఎఫెక్ట్

హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెకు దిగడంతో నేడు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెడ్ లైన్ - మీయాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకూ మెట్రో స్టేషన్‌లలో టికెట్ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగులు విధుల బహిష్కరణ చేశారు. దీంతో సమ్మె ఎఫెక్ట్ మెట్రోపై పడింది. 5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదని ఆందోళనకు దిగారు. తమకు 5 ఏళ్లుగా 11 వేల రూపాయల జీతం మాత్రమే కంపెనీ ఇస్తోందని.. 15 వేల నుంచి 18 వేల రూపాయల వరకూ జీతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగంలో సరైన సమయం లేదని.. ఒకరు ఉద్యోగం చేస్తుంటే మరొక రిలీవర్ సరైన సమయానికి రాకపోయినా పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం భోజనం చేయడానికి కూడా సమయం ఇవ్వడంలేదని ఆరోపించారు. దీంతో అమీర్‌పేట్, మియాపూర్ మెట్రో స్టేషన్‌లలో.. టికెట్ల కోసం ప్రయాణికులు భారీగా క్యూ కట్టారు.

Updated Date - 2023-01-03T17:04:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising