కేసీఆర్‌ది ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండా..
ABN, First Publish Date - 2023-02-17T03:31:09+05:30
సీఎం కేసీఆర్ ఆర్‌ఎ్‌సఎస్ ఎజెండా అమలు చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తన కూతురు కవిత అరె్‌స్టను తప్పించడానికి ఆర్‌ఎ్‌సఎస్ నేతలతో టచ్‌లో ఉంటున్నారని ఆరోపించారు.
కొండగట్టుకు నిధులపై కోర్టుకెళ్తా: కేఏ పాల్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్ ఆర్‌ఎ్‌సఎస్ ఎజెండా అమలు చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తన కూతురు కవిత అరె్‌స్టను తప్పించడానికి ఆర్‌ఎ్‌సఎస్ నేతలతో టచ్‌లో ఉంటున్నారని ఆరోపించారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ బీజేపీ బీ టీమ్ అని నిరూపించుకుంటున్నారు కాబట్టే.. కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ కావడం లేదన్నారు. కొండగట్టు ఆలయానికి రూ.600 కోట్ల నిధులు ఇవ్వడాన్ని కోర్టులో సవాల్ చేస్తానని తెలిపారు. తాను సెక్యులర్‌నని చెప్పుకుంటున్న కేసీఆర్.. చర్చిలకు, మసీదులకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఏప్రిల్ 14న తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి కేసీఆర్ ఒప్పుకున్నందున శుక్రవారం తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడిని విరమించుకున్నట్లు చెప్పారు.
Updated Date - 2023-02-17T03:31:25+05:30 IST