ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister KTR: తెలంగాణ పారిశ్రామిక పురోగతికి కేంద్రం సహకరించాలి..

ABN, First Publish Date - 2023-01-14T14:40:37+05:30

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కే.తారకరామారావు (Minister KTR) కేంద్రానికి లేఖ (Letter) రాశారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ చేపట్టిన కార్యక్రమాలకు.. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కే.తారకరామారావు (Minister KTR) కేంద్రానికి లేఖ (Letter) రాశారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ చేపట్టిన కార్యక్రమాలకు.. ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని వినతి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పారిశ్రామిక పురోగతికి కేంద్రం సహకరించాలని, దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకంగా మారిందన్నారు. న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులు రాష్ట్రానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకునే సమయం ఆసన్నమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి పట్ల తన నిబద్ధతను చాటుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి రాబోయే బడ్జెట్ ఉత్తమ సందర్భం అన్న మంత్రి, న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులను రాష్ట్రానికి ఈ బడ్జెట్‌లోనైనా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తెలంగాణకి వివిధ శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన మంత్రి కేటీఆర్.. ఈరోజు పరిశ్రమల శాఖ చేపట్టిన పలు కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించాల్సిన బడ్జెట్ నిధుల సహకారంపై కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వినూత్నమైన పారిశ్రామిక విధానాలతో అద్భుతమైన పారిశ్రామిక ప్రగతిని సాధిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. దీంతోపాటు రాష్ట్రంలోకి వస్తున్న పెట్టుబడులకు అనుగుణంగా పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన చేపట్టామని, ఇందులో భాగంగా దేశంలోనే అతిపెద్ద టెక్ట్స్‌టైల్ పార్కుతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ ఫార్మా క్లస్టర్ హైదరాబాద్ ఫార్మాసిటీ వంటి భారీ మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇటువంటి భారీ పారిశ్రామిక పార్కులు కేవలం తెలంగాణ రాష్ట్రానికే, కాకుండా జాతీయ ప్రాధాన్యత కలిగి దేశ పారిశ్రామిక అభివృద్ధికి సైతం ఇతోదికంగా ఉపయోగపడతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భరభారత్ వంటి నినాదాలు, విధానాలను బలంగా నమ్మితే, వాటిని నిజం చేయగలిగే శక్తి కలిగిన తెలంగాణ వంటి అభివృద్ధికాముఖ రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ తన లేఖలో అభిప్రాయపడ్డారు. తెలంగాణ లాంటి ప్రోగ్రెసివ్ రాష్ట్రాలు బలంగా మారినప్పుడే దేశ ప్రగతి వేగంగా మరించే ముందుకు పోతుందని తెలిపిన కేటీఆర్, దేశ పారిశ్రామిక రంగంలో తన స్వల్పకాలిక ప్రస్థానంతోనే అత్యంత కీలకంగా మారిన తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2023-01-14T14:40:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising