కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mobile Emergency Alert: ఫోన్లకు ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చిందా? అయితే అసలు విషయం ఇదీ..!

ABN, First Publish Date - 2023-09-21T12:48:42+05:30

మీ మొబైల్‌‌కు అలర్ట్ మెసేజ్ వచ్చిందా? మెసేజ్ వచ్చిన కాసేపటికి శబ్ధం వస్తుందా? ఏంటి? అని కంగారు పడుతున్నారా? అయితే అలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరి మొబైల్ స్క్రీన్లపై

Mobile Emergency Alert: ఫోన్లకు ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చిందా? అయితే అసలు విషయం ఇదీ..!

హైదరాబాద్: మీ మొబైల్‌‌కు అలర్ట్ మెసేజ్ వచ్చిందా? మెసేజ్ వచ్చిన కాసేపటికి శబ్ధం వస్తుందా? ఏంటి? అని కంగారు పడుతున్నారా? అయితే అలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరి మొబైల్ స్క్రీన్లపై ఈ రకమైన మెసేజ్‌లు వస్తున్నాయి. దీంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. మరికొంత మంది ఉలిక్కిపడి.. భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ఎవరూ ఆందోళన చెందక్కర్లేదు. అసలు విషయం ఏంటంటే..

టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ మొబైల్ అలర్ట్‌ని ప్రయోగాత్మకంగా నిర్వహించింది. దీంతో మనకు మొబైల్ స్రీన్లపై ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్ డిస్‌ప్లే అయింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనుబంధంతో ఈ టెస్టింగ్ జరిగింది. భవిష్యత్తులో ప్రకృతి విపత్తుల నుంచి ప్రజల్ని అలర్ట్ చేయడానికి ఈ ట్రయల్ టెస్ట్ నిర్వహించారు.

మెసేజ్ ఇలానే వచ్చిందా?

ముఖ్యమైన సమాచారం : మీరు మీ మొబైల్‌లో కొత్త శబ్దం మరియు వైబ్రేషన్‌తో అత్యవసర పరిస్థితి గురించి నమూనా సందేశాన్ని అందుకోవచ్చు. దయచేసి భయపడవద్దు, ఈ సందేశం నిజమైన అత్యవసర పరిస్థితిని సూచించదు. ప్రణాళికాబద్ధమైన ట్రయల్ ప్రాసెస్‌లో భాగంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సహకారంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, భారత ప్రభుత్వం ద్వారా ఈ సందేశం పంపబడుతోంది.

WhatsApp Image 2023-09-21 at 12.32.46 PM.jpeg

Updated Date - 2023-09-21T13:31:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising