Rajasingh : మంత్రి తలసాని పిలిచి అవమానించారు
ABN, First Publish Date - 2023-05-06T12:27:42+05:30
నూతన సచివాలయం గేటు వద్ద గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ను సెక్యూరిటీ అడ్డుకుంది.
హైదరాబాద్ : నూతన సచివాలయం గేటు వద్ద గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ను సెక్యూరిటీ అడ్డుకుంది. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనను పిలిచి అవమానించారని రాజాసింగ్ వాపోతున్నారు. సిటీ ఎమ్మెల్యేలతో మీటింగ్ ఉందని తలసాని పిలిస్తేనే సచివాలయానికి వచ్చానన్నారు. ఎమ్మెల్యేలకే సచివాలయంలోకి అనుమతి లేకుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని రాజా సింగ్ ప్రశ్నించారు. ప్రజల డబ్బుతో కట్టిన సచివాలయంలోకి ప్రజా ప్రతినిధులను అనుమతించకపోవటం సిగ్గుచేటని పేర్కొన్నారు.
Updated Date - 2023-05-06T12:27:42+05:30 IST