ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దర్శనమిచ్చిన సంగమేశ్వరాలయం!

ABN, First Publish Date - 2023-01-13T04:06:53+05:30

మూడు మాసాల అనంతరం కృష్ణా జల దివాసం నుంచి సంగమేశ్వరాలయం బయల్పడింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించే నాగర్‌కర్నూలు జిల్లా సోమశిల సమీపంలోని ఏపీ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జలదివాసం నుంచి బయటకు.. మరబోట్లపై భక్తుల ప్రదక్షిణలు

కొల్లాపూర్‌, జనవరి 12: మూడు మాసాల అనంతరం కృష్ణా జల దివాసం నుంచి సంగమేశ్వరాలయం బయల్పడింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించే నాగర్‌కర్నూలు జిల్లా సోమశిల సమీపంలోని ఏపీ సరిహద్దులో గల సప్తనదుల సంగమ క్షేత్రం వద్ద ఉన్న ఈ సంగమేశ్వరాలయం ఏటా భారీ వర్షాలు, నదీ జలాలు పెరిగిన సందర్భంలో జల దివాసంలోనే ఉంటుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులోని కృష్ణానది తిరుగు జలాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతుండటంతో ఆలయ గోపురాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. దీంతో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయం చుట్టూ మరబోటులోనే ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహాశివరాత్రి నాటికి ఆలయం జలదివాసం నుంచి పూర్తిగా బయటపడుతుందని, ఆలయంలోని వేపధార లింగాన్ని భక్తులు దర్శించుకోవచ్చని ఆలయ పూజారి తెలకపల్లి రఘురామయ్యశర్మ చెప్పారు.

Updated Date - 2023-01-13T04:06:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising