ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడే సరళ్‌ యాప్‌ షురూ

ABN, First Publish Date - 2023-01-07T02:45:39+05:30

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ.. పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్చువల్‌గా ప్రారంభించనున్న బీజేపీ అధ్యక్షుడు నడ్డా

పార్టీ బలోపేతం, ఎన్నికలపై శ్రేణులకు దిశానిర్దేశం

యాప్‌తో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సత్ఫలితాలు

న్యూఢిల్లీ, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ.. పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా శనివారం రాష్ట్రంలో ‘సంఘటన్‌ రిపోర్టింగ్‌ అండ్‌ అనాలసిస్‌ (ఎస్‌ఏఆర్‌ఏఎల్‌-సరళ్‌)’ యాప్‌ను ఆవిష్కరించనుంది. సంఘటన్‌ మహా విస్తార్‌ అభియాన్‌లో భాగంగా పార్టీ విధానాలు, కార్యక్రమాలను కార్యకర్తలందరికీ చేరవేయాలనే లక్ష్యంతో ఈ యాప్‌ను రూపొందించారు. ఉదయం 10 గంటలకు బీజేపీ జాతీయ అఽధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీ నుంచి వర్చువల్‌గా యాప్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడతారు. పార్టీని బలోపేతం, రాబోయే ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బూత్‌ కమిటీల సభ్యులు, అధ్యక్షులు, మండల అఽధ్యక్షులు, శక్తి కేంద్రాలు, నియోజకవర్గాలు, పార్లమెంటు ఇన్‌చార్జిలు, కొత్తగా నియమించిన పాలక్‌లు పాల్గొంటారు. వీరందరూ వారి వారి ప్రాంతాల నుంచే యాప్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

రాష్ట్రంలో మొత్తం 6973 శక్తి కేంద్రాలు, 34,867 బూత్‌లు ఉన్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌, సంస్థాగత వ్యవహరాల ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని బీజేపీ నేతలు తెలిపారు. సరళ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ఇప్పటికే ఎంపిక చేసిన కార్యకర్తలకు క్యూఆర్‌ కోడ్‌ పంపించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు ఈ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. లేదా 6359119119 నంబరుకు మిస్డ్‌ కాల్‌ ఇవ్వొచ్చు. ఈ యాప్‌లో దేశవ్యాప్తంగా ఉన్న బూత్‌లు, శక్తి కేంద్రాలు, జిల్లాలు, మండలాలు, విభాగాలు, రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం మొతాన్ని పొందుపరిచారు. ఇది సోషల్‌ మీడియాకు కూడా అనుసంధానమై ఉంటుంది. అధిష్ఠానం నిర్వహించబోయే కార్యక్రమాలు, దేశంలో పార్టీ ప్రముఖుల రోజువారీ కార్యక్రమాల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ఇప్పటికే గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో సరళ్‌ యాప్‌ను వినియోగించుకొని మంచి ఫలితాలు సాఽధించామని పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో కూడా ఈ యాప్‌ వల్ల తమకు, పార్టీకి కలిసి వస్తుందని అంటున్నారు.

Updated Date - 2023-01-07T02:45:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising