ఓట్ల కోసం కంటోన్మెంట్ బోర్డు ముట్టడి
ABN, First Publish Date - 2023-03-11T00:30:13+05:30
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల కోసం తొలగించబడిన 35 వేల మంది ఓట్లను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ టీఎ్‌సఎండీసీ చైర్మన్ మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు.
మారేడ్‌పల్లి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల కోసం తొలగించబడిన 35 వేల మంది ఓట్లను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ టీఎ్‌సఎండీసీ చైర్మన్ మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. శుక్రవారం కంటోన్మెంట్ బోర్డు ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఓటు కోల్పోయిన వారు ప్లకార్డు లు పట్టుకుని వందలాది మంది బోర్డు కార్యాలయం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. అప్పటికే పోలీస్ సిబ్బంది కంటోన్మెంట్ బోర్డు చుట్టూ భారీకేడ్లను ఏర్పాటు చేశారు. బారికేడ్లను తోసుకుంటూ లోపలికి ప్రవేశించిన నిరసనకారులు బోర్డు ఆవరణలో రోడ్డు పై భైఠాయించి నినాదాలు చేశారు. ‘35 వేల ఓట్లు తొలగించారు. ఇదేనా ప్రజాస్వామ్యమంటే.. మా ఓటు హక్కును పునరుద్దరించాలి. మా ఓట్లను తొలగించడం సిగ్గు చేటు’ తమ ఓటు ఎలా తొలగిస్తారంటూ అంటూ ప్రశ్నించారు. తమకు ఓటు హక్కు కల్పించాలని రెండు చేతులతో దండాలు పెడుతూ నినాదాలు చేపట్టారు. దీంతో ఒకానొక సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం చైర్మన్ మన్నె క్రిశాంక్ కంటోన్మెంట్ బోర్డు సూపరింటెండెంట్ అక్బర్ అలీని కలిసి వినతిపత్రం అందజేశారు. తొలగించిన ఓట్లు పునరుద్ధరించే వరకూ ఎన్నికలు నిర్వహించొద్దంటూ డిమాండ్ చేశారు.
బోగస్ ఓట్లు ప్రోత్సహిస్తే కేసులు: జంపన్న
బోయిన్‌పల్లి : కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు కార్యక్రమం సికింద్రాబాద్ బోర్డు కార్యాలయంలో నిర్వహించారు. ఈ ప్రక్రియలో చాలా వరకు బోగస్ ఓట్లను కొందరు నాయకులు, వారి అనుచరులు ప్రోత్సహించారని, ఇలాంటి వాటిని గుర్తించాలని, బోగస్ ఓట్ల కోసం దరఖాస్తు చేసేవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ బోర్డు అధికారులను డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జంపన్న ప్రతాప్ ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు నగారా మోగిన నేపథ్యంలో కొత్త ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలని బోర్డు అధికారులు ప్రజలకు సూచించారు. దీంతో బోగస్ ఓట్ల కోసం నాయకులు, వారి అనుచరులు కుప్పలు తెప్పలుగా దరఖాస్తు చేశారన్నారు. కంటోన్మెంట్ సీఈవోకు బోగస్ ఓట్లపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారి ఓట్లు తొలగించారన్నారు. అలాంటి వారి ఓట్లను కొందరు నాయకులు ఇతర అడ్ర్‌సలు పెట్టి బోగస్ ఓట్లను ప్రోత్సహించే పనిలో ఉన్నారన్నారు. ప్రస్తుతం అధికారులు దరఖాస్తులు పరిశీలిస్తున్నారని, ఆయా అడ్ర్‌సలో దరఖాస్తుదారులు లేకుంటే కేసులు పెట్టాలని ఆయన చేశారు.
Updated Date - 2023-03-11T00:30:13+05:30 IST