ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బండి సంజయ్‌కి సిట్‌ నోటీసులు

ABN, First Publish Date - 2023-03-22T03:06:19+05:30

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి సిట్‌ నోటీసులు ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పేపర్‌ లీక్‌ వ్యాఖ్యలపై ఆధారాలివ్వాలని హుకుం

బంజారాహిల్స్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి సిట్‌ నోటీసులు ఇచ్చింది. గ్రూప్‌-1 పేపర్‌ లీక్‌ అయిందని ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది. టీఎ్‌సపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం లీక్‌ అయిందని, అందులో భాగంగానే జగిత్యాల జిల్లాలోని ఒక మండలంలో 50 మందికిపైగా, ఒక చిన్న గ్రామంలో ఆరుగురు అభ్యర్థులు అర్హత సాధించారని సంజయ్‌ ఇటీవల ఆరోపించారు. క్వాలిఫై అయిన వారిలో బీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ, సింగిల్‌ విండో చైర్మన్‌, సర్పంచ్‌ పిల్లలు, వారి బంధువులు ఉన్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలను సీరియ్‌సగా తీసుకున్న సిట్‌.. సంజయ్‌కి 91 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసింది. ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను తీసుకుని ఈ నెల 24న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. బంజారాహిల్స్‌లోని సంజయ్‌ ఇంటికి మంగళవారం వచ్చిన సిట్‌ అధికారులు, ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్లారు.

Updated Date - 2023-03-22T03:06:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising