ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay: మోదీ పాలనకు మిస్డ్‌ కాల్‌తో మద్దతివ్వండి

ABN, First Publish Date - 2023-06-01T02:54:19+05:30

ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనకు మిస్డ్‌ కాల్‌తో మద్దతు తెలపాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. మిస్డ్‌ కాల్‌ ఇవ్వాల్సిన మొబైల్‌ నెంబర్‌ 9090902024ను విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌ పిలుపు.. 9090902024 నంబర్‌ విడుదల

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనకు మిస్డ్‌ కాల్‌తో మద్దతు తెలపాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. మిస్డ్‌ కాల్‌ ఇవ్వాల్సిన మొబైల్‌ నెంబర్‌ 9090902024ను విడుదల చేశారు. మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా గురువారం నుంచి జూన నెలాఖరు వరకు బీజేపీ తలపెట్టిన మహా సంపర్క్‌ అభియాన కార్యక్రమాల షెడ్యూల్‌నూ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో విడుదల చేశారు. మహాజన సంపర్క్‌ అభియాన వెబ్‌సైటు, ప్రత్యేక గీతాన్నీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాసంపర్క్‌ అభియానలో భాగంగా జూన 1 నుంచి 7 వరకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మీడియా సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు. వికాస్‌ తీర్థ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులను జాతీయ, స్థానిక నేతలు సందర్శించాలన్నారు.

ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ నేత/కేంద్ర మంత్రి హాజరవుతారని చెప్పారు. జూన 8 నుంచి 14 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ సీనియర్‌ నేతలు, మేధావులతో సమ్మేళనాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మోర్చాల సంయుక్త సమ్మేళనం నిర్వహించాలని, ప్రభావితం చేయగల వ్యక్తులతోనూ ఆత్మీయ సమావేశాలను నిర్వహించాలన్నారు. జూన 15 నుంచి 21 వరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 వేల మందికి తగ్గకుండా బహిరంగ సభలు నిర్వహించాలన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన 21న అన్ని మండలాల్లో ఘనంగా యోగా దివస్‌ నిర్వహించాలన్నారు. జూన 22 నుంచి 28 వరకు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో శక్తికేంద్రాల వారీగా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. గడప గడపకూ బీజేపీ పేరుతో మహాజన సంపర్క్‌ అభియాన కార్యక్రమాలపైన విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. జూన 23న పోలింగ్‌ బూతల వారీగా శ్యామాప్రసాద్‌ ముఖర్జీ బలిదాన కార్యక్రమాలు నిర్వహిచాలని, జూన 25న ప్రతి పోలింగ్‌ బూతలో మనకీ బాత నిర్వహించాలని ఆయన సూచించారు.

తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం కృషి

తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతగానో పాటుపడుతోందని బండి సంజయ్‌ తెలిపారు. పీఎం ఆవాస్‌ కింద రాష్ట్రానికి 3.50 లక్షల ఇళ్లు కేటాయించిందని, జల్‌ జీవన కింద 54 లక్షల మందికి నల్లాల ద్వారా మంచి నీరందించిందని, 54 లక్షల మందికి ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేసిందని వెల్లడించారు. పీఎం కౌశల్‌ వికాస్‌ యోజన కింద 2.96 లక్షల మందికి, పీఎం స్వనిధి ద్వారా 1.03 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు. స్వచ్ఛభారత్‌ ద్వారా 30 లక్షల టాయిలెట్లను నిర్మించినట్లు పేర్కొన్నారు. మోదీ ప్రధాని అయ్యాక దేశంలో మచ్చలేని, అవినీతి రహిత పాలన కొనసాగుతోందన్నారు. కులమతాలు, భాషాభేదాలకు అతీతంగా పనిచేస్తూ పేదలు, అణగారిన వర్గాలు, వివక్షకు గురైన వారి జీవితాల్లో మార్పు కోసం రోజుకు 18 గంటలు ప్రధాని కష్టపడుతున్నారని ఆయన కొనియాడారు.

అణగదొక్కితే ఆగిపోయే వ్యక్తిని కాను

తాము ఆచరణ సాధ్యమయ్యే హామీలను మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరుస్తామని, అందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని బండి సంజయ్‌ కోరారు. బుధవారం హైదరాబాద్‌ లకిడీకాపూల్‌లోని ఓ హోటల్‌లో జరిగిన బీసీ మేధావుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను కార్యకర్త స్థాయి నుంచి వచ్చానని, అణగదొక్కితే ఆగిపోయే వ్యక్తిని కాదని అన్నారు. బీజేపీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన సీహెచ విఠల్‌, సభ్యులు బూర నర్సయ్యగౌడ్‌, చంద్రవదన, ఎస్‌.కుమార్‌, వొడ్నాల శ్రీరాములు, ఆలె భాస్కర్‌ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీనియర్‌ జర్నలిస్టులు పాశం యాదగిరి, విఠల్‌ సహా సంచార జాతుల సంఘం నాయకులు, వివిధ కులవృత్తుల నాయకులు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.

బండి సంజయ్‌ని పలకరించిన కవిత

నిజామాబాద్‌లో బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీజేపీ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినర్సయ్య నూతన గృహ ప్రవేశానికి కవితతో పాటు బండి సంజయ్‌ హాజరయ్యారు. వీరిద్దరూ ఎదురు కాగా.. ‘వెల్‌కమ్‌ టు నిజామాబాద్‌’ అంటూ బండి సంజయ్‌ను కవిత పలకరించారు. ఆయన కూడా కవితతో నవ్వుతూ మాట్లాడారు. తమతో వచ్చిన నేతలను పరస్పరం పరిచయం చేసుకున్నారు.

Updated Date - 2023-06-01T02:54:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising