ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Supreme Court: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై నేడు ‘సుప్రీం’ విచారణ..

ABN, First Publish Date - 2023-02-17T11:03:11+05:30

ఢిల్లీ: ఎమ్మెల్యేల కొనుగోలు ( MLAs Purchase) వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల (Petitions)పై శుక్రవారం సుప్రీంకోర్టు (Supreme Court) విచారించనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఎమ్మెల్యేల కొనుగోలు ( MLAs Purchase) వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల (Petitions)పై శుక్రవారం సుప్రీంకోర్టు (Supreme Court) విచారించనుంది. ఎమ్మెల్యేలకు ఎర చూపిన వ్యవహారంపై దర్యాప్తును తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సీబీఐ (CBI)కి అప్పగించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt.) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల కేసు సీబీఐ చేతికి వెళ్తే ఉపయోగం ఉండదని, ఇప్పటి వరకు జరిగిన విచారణ అంతా... పక్కదారి పడుతుందని ఈనెల 7, 8 తేదీల్లో జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, సిద్ధార్థ లుత్రాలు ప్రత్యేకంగా వాదనలు వినిపించారు. వెంటనే హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని న్యాయస్ధానాన్ని కోరారు. అయితే స్టే ఇచ్చేందుకు సీజేఐ ధర్మాసనం నిరాకరించింది.

సీబీఐ అధికారులు పత్రాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని, స్టేటస్ కో ఇవ్వాలని న్యాయవాదులు సీజేఐకు విజ్ఞప్తి చేశారు. ఒకసారి సీబీఐ చేతికి వెళితే... కేసు వెనక్కి రావడం కష్టం అవుతుందన్నారు. వాదనలు విన్న అనంతరం స్టేటస్ కో ఇవ్వడానికి కూడా ధర్మాసనం నిరాకరించింది. కేసులో మెరిట్స్ ఉంటే రివర్స్ చేస్తూ ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం పేర్కొంటూ... తదుపరి విచారణ శుక్రవారం (17వ తేదీ) నాటికి వాయిదా వేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారించనుంది.

కాగా హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణ (CBI investigation)కు న్యాయస్థానం గ్రీన్‌ సిగ్నల్‌ (Green Signal) ఇచ్చింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్థిస్తూ.. ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా ఈ ఆర్డర్‌పై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు కొంత సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ (Advocate General) అడిగారు. అప్పటి వరకు ఆర్డర్‌ను సస్పెండ్‌లో ఉంచాలని కోరారు. అయితే ఆర్డర్ సస్పెన్షన్‌కు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-02-17T13:49:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising