Alrpazolam drug: తమిళనాడు టూ నిజామాబాద్ వయా హైదరాబాద్
ABN, First Publish Date - 2023-01-14T08:14:56+05:30
హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(హెచ్-న్యూ) పోలీసులు అంతరాష్ట్ర స్మగ్లర్ల ఆటకట్టించారు
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(హెచ్-న్యూ) పోలీసులు అంతరాష్ట్ర స్మగ్లర్ల ఆటకట్టించారు. తమిళనాడు నుంచి నిజామాబాద్‌కు హైదరాబాద్ మీదుగా అల్ర్పాజోలమ్ డ్రగ్‌ను సరఫరా చేస్తున్న నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. డీసీపీ చక్రవర్తి గుమ్మి తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్‌కు చెందిన యోగేష్, మహేశ్వర్‌లు కల్లు దుకాణం నిర్వహిస్తున్నారు. అల్ర్పాజోలమ్ డ్రగ్‌ను ఉపయోగించి కల్తీకల్లు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. తమిళనాడుకు చెందిన ముత్తుకుమార్, సౌందరరాజన్‌ల ద్వారా అల్ర్పాజోలమ్‌ను హైదరాబాద్‌కు తెప్పిస్తున్నారు. హైదరాబాద్ నుంచి కేతావత్ భరత్, చిన్న గంగాధర్‌లు అల్ర్పాజోలమ్‌ను నిజామాబాద్‌కు తరలిస్తుంటారు.
కొంతకాలంగా ఈ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు తెలిసిం ది. ముత్తుకుమార్, సౌందరరాజన్‌లు అల్ర్పాజోలమ్‌తో అమీర్‌పేట తరలించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా హెచ్‌న్యూ పోలీసులు స మాచారం అందుకున్నారు. నిజామాబాద్ నుం చి భరత్, గంగాధర్‌లు సైతం అక్కడికి చేరుకున్న అనంతరం హెచ్‌న్యూ టీమ్, పంజాగుట్ట పోలీసులతో కలిసి దాడిచేసి నలుగురు స్మగ్లర్స్‌ను పట్టుకున్నారు. వారి నుంచి కేజీ అల్ర్పాజోలమ్, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు యోగేష్, మహేశ్వర్‌లు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని డీసీపీ వెల్లడించారు.
Updated Date - 2023-01-14T08:14:58+05:30 IST