TS News: కేంద్ర ప్రభుత్వ అవార్డులు సాధించడంపై ఎర్రబెల్లి హర్షం
ABN, First Publish Date - 2023-04-17T18:46:34+05:30
తెలంగాణ (Telangana) గ్రామ పంచాయతీలు కేంద్ర ప్రభుత్వ అవార్డులు సాధించడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) హర్షం వ్యక్తం చేశారు.
ఢిల్లీ: తెలంగాణ (Telangana) గ్రామ పంచాయతీలు కేంద్ర ప్రభుత్వ అవార్డులు సాధించడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం తమ పనితనాన్ని గుర్తించినందుకు అభినందనలు తెలిపారు. కేసీఆర్ (KCR) ప్రణాళికప్రకారం గ్రామాలను అభివృద్ధిబాట పట్టించారని కొనియాడారు. నాలుగేళ్ళ క్రితం కేసీఆర్ పంచాయతీ రాజ్ కొత్త చట్టం తీసుకొచ్చారని చెప్పారు. ఇతర రాష్ట్రాల మంత్రులు తనను అభినందించారని సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం గైడ్లైన్స్ ను తూచా తప్పకుండా పాటిస్తున్నామన్నారు. ఒకప్పుడు గంగదేవిపల్లి మాత్రమే అవార్డులు వచ్చేదని, కానీ కేసీఆర్ నిర్ణయాలతో తెలంగాణ పల్లెలు కొత్త రూపు దిద్దుకున్నాయన్నారు. 45కి 45 అవార్డులు తెలంగాణకే వచ్చే స్థాయిలో పల్లెలున్నాయన్నారు. తెలంగాణ పల్లె ముఖచిత్రం మారడంలో మిషన్ భగీరథ కీలక పాత్ర పోషించిందన్నారు. మిషన్ భగీరథ కు 19వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ ఇవ్వాలని చెప్పిన రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. గుజరాత్‌కి ఇచ్చినట్లే తెలంగాణ మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని కేంద్రానికి, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశానాని తెలిపారు.
Updated Date - 2023-04-17T18:46:35+05:30 IST