ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CBI: వైఎస్‌ అవినాశ్‌రెడ్డి వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి కౌంటర్

ABN, First Publish Date - 2023-04-16T20:00:30+05:30

సీబీఐ (CBI)పై ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి (MP Avinash Reddy) వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) కౌంటర్ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీబీఐ (CBI)పై ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి (MP Avinash Reddy) వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) కౌంటర్ ఇచ్చారు. కేసును కొలిక్కి తీసుకొచ్చేందుకే సీబీఐ పని చేస్తోందన్నారు. వ్యక్తులు ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. కేజ్రీవాల్‌కు నోటీసులు ఎలా ఇస్తారని మాట్లాడుతున్నారు?, అవినీతి ఆరోపణలు వస్తే దర్యాప్తు చేయొద్దా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

అవినాశ్‌రెడ్డి ఏమన్నారంటే..?

‘వివేకా కేసులో సీబీఐ విచారణ సరిగ్గా జరగట్లేదు. వాస్తవాల ఆధారంగా విచారణ జరగాలి. నాన్న భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై మాట్లాడటానికి మాటలు రావట్లేదు. భాస్కర్ రెడ్డి అరెస్ట్‌ను ఊహించని విధంగానే అరెస్ట్ చేశారు. ధైర్యం కోల్పోకుండా నిజాయితీని నిరూపించుకుంటాం. విచారణలో కీలక విషయాలను సీబీఐ వదిలేసింది.. సిల్లీ విషయాలతో వ్యక్తులే లక్ష్యంగా సీబీఐ విచారణ జరుగుతోంది. హత్య విషయం నాకంటే ముందే వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి ముందే తెలుసు. హత్యకు సంబంధించి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు..?. సమాచారం ఇచ్చిన నన్నే దోషి అంటున్నారు. సునీత, సీబీఐ ఒక లక్ష్యంతోనే వ్యవహరిస్తున్నాయి. మేం చెప్పిన అంశాలను సీబీఐ పరిశీలించడం లేదు. హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్‌గా ఎలా మారుస్తారు..? సీబీఐ సహకరించి బెయిల్ ఇప్పించింది’ అని అవినాష్ రెడ్డి చెప్పుకొచ్చారు.

‘వివేకానందరెడ్డి రాసిన లెటర్ అక్కడే ఉంది. లెటర్ దాచిపెట్టమని వివేకా అల్లుడు చెప్పారు. ఏప్రిల్ 3న మా అభ్యంతరాలను ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సమాచారం దాచినా తప్పు కాదు, లెటర్ దాచి పెట్టామన్నా తప్పుకాదు. పోలీసులు రావద్దు అని నేను చెప్పానని అనడం దారుణం. వివేకా రెండో భార్యకు షహెన్‌షా అనే కుమారుడు ఉన్నాడు. షేక్ మహ్మద్ అక్బర్‌గా 2010లో వివేకా పేరు మార్చుకున్నారు. రెండో భార్యకే ఆస్తి రాసివ్వాలని వివేకా అనుకున్నారు. దానికి సంబంధించిన రౌండ్ సీల్స్, పత్రాలు వివేకా ఇంట్లో దొరికాయి. స్టాంప్ పేపర్లు పోతే ఎందుకు విచారణ జరపడం లేదు. నేను నిజాయితీ నిరూపించుకుంటాను. వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని విచారణ జరుగుతోంది. ఈ విధంగా విచారణ చేయడం తప్పు. వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత స్టాంప్ పేపర్లు పరిశీలన, దొంగతనం జరిగింది.. ఆ పేపర్లు పోతే సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయలేదు?. పాత అధికారి చేసిన విచారణనే కొత్త బృందం ఫాలో అవుతోంది. మేం చెప్పిన అంశాలను పరిశీలించడం లేదు’ అని సీబీఐపై అవినాష్ సంచలన ఆరోపణలే చేశారు.

Updated Date - 2023-04-16T20:00:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising