TS News: ఏబీఎన్- ఆంధ్రజ్యోతిని రానీయకపోవడం ఏం సందేశం: రేవంత్
ABN, First Publish Date - 2023-04-30T17:23:43+05:30
సచివాలయ ప్రారంభాన్ని కేసిఆర్ (CM KCR) తన సొంత కార్యక్రమంలా నిర్వహించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reeddy) విమర్శించారు.
హైదరాబాద్: సచివాలయ ప్రారంభాన్ని కేసిఆర్ (CM KCR) తన సొంత కార్యక్రమంలా నిర్వహించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reeddy) విమర్శించారు. ప్రతిపక్షాలను ఆహ్వానించడంలో ప్రోటో కాల్ పాటించలేదన్నారు. గవర్నర్‌ను సైతం పిలవకపోవడం తప్పన్నారు. వాస్తు పిచ్చితో పాత సచివాలయం కూల్చి కొత్త భవన నిర్మాణానికి వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం నిర్మాణ అంచనా వ్యయం పెంచారని తెలిపారు. ఇందులో వందల కోట్లు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దీనిపై విచారణ జరిపించి జైల్‌కు పంపిస్తామని హెచ్చరించారు. కొత్త భవనాలలో ప్రజల జీవితాల్లో మార్పు రాదన్నారు. సచివాలయానికి రాని సీఎం కేసీఆర్ వైఖరి మారుతుందా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు వెలుగులోకి తెచ్చే ఏబీఎన్, ఆంధ్రజ్యోతిని రానీయకుండా ఏం సందేశం ఇస్తున్నారాని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కుక్కతోక సక్కగా కాదనేది ఎంత నిజమో కేసిఆర్ మారడు అనేది అంతే నిజమని విమర్శించారు. కేసిఆర్ తల కిందులుగా తపస్సు చేసినా ప్రజలు ఇక ఆయన్ను నమ్మరని ఎద్దేవా చేశారు. కేసిఆర్ మహారాష్ట్రకు వెళ్లి బొక్క బోర్లా పడ్డారని విమర్శించారు. బొకర మార్కెట్ కమిటీ ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్లు మూతిమీద కొట్టారని విమర్శలు చేశారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుందన్నారు.
Updated Date - 2023-04-30T17:24:42+05:30 IST