TSPSC దర్యాప్తు రిపోర్ట్.. హైకోర్టులో సబ్మిట్ చేసిన సిట్
ABN, First Publish Date - 2023-04-11T17:58:16+05:30
హైకోర్టు (Highcourt)లో TSPSC దర్యాప్తు రిపోర్ట్‌ను సిట్ సబ్మిట్ చేసింది. 250 పేజీల రిపోర్ట్స్, ఎంక్లోజర్స్‌ని కోర్టులో పోలీసులు దాఖలు చేశారు.
హైదరాబాద్: హైకోర్టు (Highcourt)లో TSPSC దర్యాప్తు రిపోర్ట్‌ను సిట్ సబ్మిట్ చేసింది. 250 పేజీల రిపోర్ట్స్, ఎంక్లోజర్స్‌ని కోర్టులో పోలీసులు దాఖలు చేశారు. 18 పేజీల సిట్ ఇన్విస్టిగేషన్ సమ్మరీ రిపోర్ట్ ను సిట్ (SIT) సబ్మిట్ చేసింది. అలాగే పేపర్ లీకేజీలో 40 లక్షల నగదు బదిలీ జరిగినట్టు సిట్ పేర్కొంది. లీకేజీ పేపర్ పోందిన 15 మందిని అరెస్ట్ చేశామని వెల్లడిచింది. శంకర్ లక్ష్మిని సాక్షిగా సిట్ పరిగణించింది. టీఎస్పీఎస్సీ లీకేజీలో ప్రధాన పాత్ర ప్రవీణ్, రాజశేఖర్‌లదేనని పేర్కొంది. టీఎస్పీఎస్సీ మెంబర్, చైర్మెన్‌ని విచారించామని తెలిపింది. సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని.. సీబీఐ, సిట్టింగ్ జడ్జ్‌తో దర్యాప్తు చేయించాలపొ పిటిషన్లపై రిపోర్ట్‌లో వివరణ కోరింది. గతంలో ఎన్నో సెన్సేషనల్ కేసుల్ని విచారించామని, టీఎస్పీఎస్సీలో కూడా పటిష్ట దర్యాప్తు చేస్తున్నామని సిట్ పేర్కొంది. అయితే ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరంలేదని రిపోర్ట్‌లో సిట్ పేర్కోంది. టీఎస్పీఎస్సీలో కీలకంగా మారిన FSL రిపోర్ట్ రావాల్సి ఉందని తెలిపింది. అలాగే దర్యాప్తులో భాగంగా వివాదస్పద కామెంట్స్ చేసిన రాజకీయ నాయకులకి నోటీసులిచ్చామని పేర్కొంది. కానీ వాళ్లు ఎలాంటి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని తెలిపింది. సాక్షుల, నిందితులు, మెంబర్ చైర్మెన్ ఇచ్చిన స్టేట్మెంట్స్, ఆధారాల్ని కోర్టుకి సిట్ సమర్పించింది. ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ , డేటా ధెఫ్ట్‌లో ఈడీ దర్యాప్తు చేస్తుంది. TSPSC దర్యాప్తుని సీబీఐకి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేస్తుంది. మిగతా 5గురు టీఎస్పీఎస్సీ మెంబర్స్ దర్యాప్తు ఉన్నట్టా? లేనట్టా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Updated Date - 2023-04-11T18:28:31+05:30 IST