Hyderabad: చికిత్స పొందుతున్న భార్య, కొడుకును ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయాడు..డాడీ ఎక్కడున్నావంటూ ఆ బాలుడు రోదిస్తుంటే..అక్కడున్నవారంతా..
ABN, First Publish Date - 2023-05-06T14:03:16+05:30
జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్త ఆస్పత్రిలో వదిలివెళ్లిపోయాడు. పుట్టిన బిడ్డ పురిట్లోనే దూరమయ్యింది. అనారోగ్యంతో ఆమెకు తోడు ఎవరూ లేక పసివాడైన..
జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్త ఆస్పత్రిలో వదిలివెళ్లిపోయాడు. పుట్టిన బిడ్డ పురిట్లోనే దూరమయ్యింది. అనారోగ్యంతో ఆమెకు తోడు ఎవరూ లేక పసివాడైన కొడుకు సేవలు చేస్తున్నాడు. నాన్న నువ్వెక్కడున్నావ్.. అని ఆ బాలుడు ఏడుస్తుంటే అక్కడున్నవారంతా చలించిపోయారు. ఆస్పత్రి సెక్యూరిటీ గార్డులు భోజనం పెట్టించి ఓదార్చారు. డెలివరీ కోసం ఆస్పత్రికి తీసుకొచ్చిన భార్యను, ఆరేండ్ల బాలుడిని వదిలి పారిపోయిన ఘటన గాంధీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్(Nizamabad)కు చెందిన గంగాధర్, మాధవి దంపతులు..ఈనెల 1న గంగాధర్ తన భార్య మాధవిని డెలివరీకోసం ఆరేళ్ల కొడుకు సాత్విక్‌తో గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. పుట్టిన బిడ్డ చనిపోయింది. ఆనారోగ్యం కారణంగా మాధవి ఆపస్మార స్థితిలోకి వెళ్లిపోగా..వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అప్పటి నుంచి గంగాధర్ కనిపించకుండా పోయాడు.గంగాధర్ ఇప్పుడే వస్తానని ఆరేళ్ల కుమారుడి చెప్పి బయటికి వెళ్లిపోయాడు..ఐదు రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో సాత్విక్ తల్లికి సపర్యలు చేస్తున్నాడు. ‘‘నాన్న ఎక్కడున్నావ్ అంటూ ఆ బాలుడు ఏడుస్తుంటే’’ అక్కడున్నవారంతా చలించిపోయారు. సెక్యూరిటీ గార్డులు సాత్విక్‌కు భోజనం పెట్టించి ఆదరించారు.
Updated Date - 2023-05-06T14:03:16+05:30 IST