Kodandaram: గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని కోరాం
ABN, First Publish Date - 2023-08-10T15:41:17+05:30
హైదరాబాద్: గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని టీఎస్పీఎస్సీ అధికారులను కోరామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ...
హైదరాబాద్: గ్రూప్-2 పరీక్షలు (Group-2 Exams) వాయిదా వేయాలని టీఎస్పీఎస్సీ (TSPSC) అధికారులను కోరామని తెలంగాణ జనసమితి (TJS Chief) అధ్యక్షుడు కోదండరామ్ (Kodandaram) అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ 7గురు అభ్యర్థుల బృందంతో వెళ్లి అధికారులతో చర్చించామన్నారు. చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని టీఎస్పీఎస్సీ అధికారులు చెప్పారన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ అందుబాటులోకి రాగానే గ్రూప్-2 పరీక్ష వాయిదాపై నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారన్నారు.
గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయలా? వద్దా? అనే అంశానికి సంబంధించి సాయంత్రంలోగా క్లారిటీ ఇస్తామని అధికారులు చెప్పారని కోదండరామ్ తెలిపారు. కనీసం మూడు నెలలపాటైన గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అధికారుల నుంచి సానుకూలంగా స్పందన రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. అధికారుల నుంచి సమాచారం వచ్చేవరకు అభ్యర్థులందరూ ఆందోళనలు నిరసనలు తెలియజేస్తారని.. స్పష్టంగా చెప్పామన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయాలని కోరామని కోదండరామ్ పేర్కొన్నారు.
Updated Date - 2023-08-10T15:41:17+05:30 IST