ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Group-1 Exams : హైకోర్టు తీర్పుపై టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2023-09-23T12:47:40+05:30

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయ్యింది. శనివారం ఉదయం ఈ పరీక్షలు రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే...

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయ్యింది.శనివారం ఉదయం ఈ పరీక్షలు రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. రద్దు చేసిన ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ ఏం నిర్ణయం తీసుకోబోతోందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈలోపు టీఎస్‌పీఎస్సీ ఉన్నతాధికారులు న్యాయనిపుణులతో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు.


తీర్పుపై అప్పీల్‌కు..!

హైకోర్టు సింగిల్ బెచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌లో టీఎస్‌పీఎస్సీ సవాల్ చేయనున్నది. ఆర్డర్ కాపీ వెంటనే ఇవ్వాలని హైకోర్టును TSPSC తరపు లాయర్లు కోరారు. సోమవారం అప్పీల్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా.. జూన్-11న రెండోసారి గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.

రద్దుకు కారణమిదే..!

గ్రూప్-1 రద్దు కోరుతూ హైకోర్టులో జూన్‌లో మరో పిటిషన్ దాఖలైంది. ముగ్గురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకుండా, హాల్టికెట్ నంబర్, ఫొటో లేకుండానే ఓఎమ్మార్ షీట్ (OMR Sheet) ఇచ్చారని ఆ ముగ్గురు పిటిషన్‌‌లో పేర్కొన్నారు. గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు. రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా 2,33,248 మందే హాజరయ్యారు. హాజరు శాతం 61.37గా నమోదైంది. టీఎస్‌పీఎస్సీలో లీకేజీ వ్యవహారం కారణంగా ప్రిలిమ్స్‌ పరీక్షను మళ్లీ నిర్వహించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-09-23T12:47:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising