Viveka Murder Case: వివేకా హత్య కేసు.. వెలుగులోకి కొత్త కోణం
ABN, First Publish Date - 2023-04-11T16:47:36+05:30
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Murder Case)పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Murder Case)పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. సునీల్ యాదవ్ (Sunil Yadav) తల్లిని వివేకా లైంగిక వేధింపులకు గురిచేశాడని భాస్కర్ రెడ్డి (Bhaskar Reddy) తరుపు న్యాయవాది పేర్కొన్నారు. దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేస్తూ భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్‌పై వాదనలు వినిపించారు. సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగిక వేధింపులకు గురిచేశాడని, దీంతో కక్ష కట్టి సునీల్ యాదవ్ వివేకా తలపై దాడి చేసి హత్య చేశాడని పిటిషనర్ తరుపు న్యాయవాది పేర్కొన్నారు. అలాగే ఈ కేసులో ఎస్పీ రాంసింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వెళ్లారని, రాంసింగ్ వ్యక్తి గతంగా టార్గెట్ చేసి తమను ఇరికిస్తున్నారని నిందితుడు భార్య తులసమ్మ వాదనలు వినిపించింది. దీంతో రామ్ సింగ్ వ్యవహారం పై అనుమానాలు రావడం తో కొత్త ఐవోను నియమించిందన్నారు. కొత్తగా నియమించిన సిట్ వివరాల ఆర్డర్ కాపీ ఉందా అని వాదనలు విన్న న్యాయస్థానం ప్రశ్నించింది. నూతనంగా నియమించిన సీబీఐ సిట్ టీమ్ అధికారుల వివరాలను పిటిషనర్ తరుపు న్యాయవాది ఇచ్చారు. గూగుల్ టెక్ ఔట్‌ను ఆధారంగా చేసుకొని ఎలా తమను కేసులో పెడతారని ప్రశ్నించారు. సీబీఐ, సునీత కలిసిపోయి దస్తగిరిని అప్రూవర్‌గా మార్చారని వాదనల్లో ఆరోపించారు. తదుపరి విచారణ గురువారంకి కోర్టు వాయిదా వేసింది.
నిన్న హైకోర్టులో అవినాష్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు
వివేకానందరెడ్డి హత్య (Viveka Murder Case)కేసులో తన విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులను సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP Avinash reddy) హైకోర్టును కోరారు. తన విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని గతంలో దాఖలు చేసిన పిటిషన్‌లోనే మధ్యంతర పిటిషన్ వేశారు. గత నెల 14న హైదరాబాద్‌లో సీబీఐ అధికారులు అవినాష్‌రెడ్డి విచారించిన విషయం తెలిసిందే. ఆ రోజు విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులు సమర్పించేలా సీబీఐని (CBI) ఆదేశించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2023-04-11T17:00:43+05:30 IST