ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా సంఘాలకు వద్దన్నా రుణం!

ABN, First Publish Date - 2023-02-28T03:43:34+05:30

మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన రుణ లక్ష్యం ఇంకా చేరువ కాలేదు. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో నెల రోజులు మాత్రమే గడువు ఉండటంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

లక్ష్యం చేరుకొనేందుకు సెర్ప్‌ విభాగం అధికారుల పాట్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన రుణ లక్ష్యం ఇంకా చేరువ కాలేదు. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో నెల రోజులు మాత్రమే గడువు ఉండటంతో.. ఈలోపు వందశాతం రుణాలు ఎలా అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన రూ.20 లక్షల రుణ అర్హత ఉన్న 2,45,287 సంఘాలకు ఇప్పటికే రుణాలందించారు. మిగిలిన వాటిలో అర్హత ఉన్న సంఘాలను గుర్తించి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లక్ష్యాలను చేరేందుకు సెర్ప్‌ కసరత్తు చేపట్టింది. ప్రస్తుత (2022-23) ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా స్వయంసహాయక సంఘాలకు రూ.15 వేల కోట్ల రుణాలివ్వాలని ముందుగా లక్ష్యాన్ని నిర్దేశించినా.. మధ్యలో మరో రూ.3 వేల కోట్ల రుణ పరిమితిని ప్రభుత్వం పెంచడంతో లక్ష్యం రూ.18 వేలకోట్లకు చేరింది. ఆదివారం నాటికి రూ.14,977 కోట్ల రుణాలిచ్చారు. తదుపరి అర్హత ఉన్న సంఘాలను గుర్తించి మిగిలిన రూ.3,023 కోట్ల రుణాలు అందించడంపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, ఏపీఎంలు, సీసీలు క్షేత్రస్థాయిలో పర్యటించి మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు.

రెండు నెలల కిందట రుణ పరిమితి మరో రూ.3 వేల కోట్లు అదనంగా పెంచడంతో దాన్ని పూర్తిచేయడం ఇబ్బందిగా మారిందని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. రుణాల పెంపును దృష్టిలో ఉంచుకొని ఈ రెండు నెలల్లో కొత్తగా 59 వేల మంది సభ్యులతో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసినా.. వాటి రుణ అర్హతకు నిబంధనల ప్రకారం ఆరునెలల గడువు అవసరం. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం కాకుండా వచ్చే 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే ఆ సంఘాలు రుణ అర్హత పొందుతాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత సాధించిన ప్రతీ సంఘానికి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల రుణాలు అందిస్తున్నారు. గతంలో బ్యాంకు లింకేజీ ద్వారా సంఘాలకు మాత్రమే రుణాలు ఇచ్చేవారు. ప్రస్తుతం మహిళా సభ్యులకు కూడా వ్యక్తిగత రుణాలు ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) పరిధిలో 3,99,120 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉండగా వాటిలో 43,29,058 మంది సభ్యులున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) పరిధిలో మరో 1,81,225 సంఘాల్లో 19 లక్షల మంది సభ్యులున్నారు.

వద్దన్నా రుణాలిస్తున్నారు..

అధికారులు నిర్దేశించిన రుణ లక్ష్యాలు కొత్త సమస్యను తెచ్చి పెడుతున్నాయి. చాలా చోట్ల సంఘాల సభ్యులను రుణాలు తీసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తుండగా.. మరికొన్ని చోట్ల మనుగడలో లేని సంఘాల వివరాలు సేకరించి, వాటిని పొదుపు బాట పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా తాము తీసుకున్న రుణాలపై వడ్డీని తిరిగి చెల్లిస్తామని ప్రకటించిన రాష్ట్ర సర్కారు ఏళ్ల తరబడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-02-28T03:43:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!