Kamareddy MLA: బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి రేసులో లేను
ABN, First Publish Date - 2023-12-09T09:39:19+05:30
పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి తెలిపారు. సొంత ఆస్తులును అమ్మి అయినా కామారెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేస్తానని తెలిపారు. కామారెడ్డి ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించాలనేదే తన అభిమతమన్నారు.
హైదరాబాద్ : పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి తెలిపారు. సొంత ఆస్తులును అమ్మి అయినా కామారెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేస్తానని తెలిపారు. కామారెడ్డి ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించాలనేదే తన అభిమతమన్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవికి రేసులో తాను లేనన్నారు. అసెంబ్లీకి వెళ్ళే అంశంపై పార్టీ నిర్ణయమే శిరోధార్యమన్నారు. ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఉంటే ప్రమాణం చేయననేని రాజసింగ్ చెప్పారన్నారు. అయితే పార్టీ నిర్ణయానికే తామంతా కట్టుబడి ఉంటామని వెంకట రమణారెడ్డి తెలిపారు.
Updated Date - 2023-12-09T09:39:20+05:30 IST