ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెబితే రావాల్సిందే

ABN, First Publish Date - 2023-03-04T01:02:43+05:30

గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల పని దినాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే గతంలో ఫలానా రోజు పనికి వస్తానని క్షేత్ర సహాయకుడి వద్ద పేరు నమోదు చేసుకుంటే, అదే రోజు ఏదైనా అత్యవసర పనిమీద పనికి వెళ్లకున్నా ఇబ్బంది ఉండేది కాదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఉపాధి హామీలో కొత్త నిబంధన

డిమాండ్‌ మేరకు హాజరవ్వాలి

లేదంటే పనిదినాలు కోల్పోవాల్సిందే

నార్కట్‌పల్లి, మార్చి 3: గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల పని దినాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే గతంలో ఫలానా రోజు పనికి వస్తానని క్షేత్ర సహాయకుడి వద్ద పేరు నమోదు చేసుకుంటే, అదే రోజు ఏదైనా అత్యవసర పనిమీద పనికి వెళ్లకున్నా ఇబ్బంది ఉండేది కాదు. కానీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన నేషనల్‌ మస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఎన్‌ఎంఎంఎ్‌స)లో వస్తానని పేరు నమోదు చేసుకున్న రోజు పనికి రాకుంటే 100రోజుల పని దినాల్లో కోత పడుతుంది. పనికి వస్తానని చెప్పి పేరు రాయిస్తే కచ్చితంగా హాజరుకావాల్సిందే. లేదంటే పని దినాలు తగ్గుతాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి తీసుకువచ్చిన కొత్త మెలిక ఇది. రాగాస్‌ సాఫ్ట్‌వేర్‌ స్థానంలో వాడకంలోకి వచ్చిన ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న విధానమిది. గతంలో ఏడాదిలో ఎప్పుడైనా 100 రోజుల పనిదినాలను పూర్తిచేసుకునే వీలుండేది. కానీ ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌తో ఈ అవకాశం లేదు. వారం రోజులు కూలీ పనికి వస్తానన్న డిమాండ్‌ మేరకు పనులకు రాకపోయారో ఎవరి ప్రమేయం లేకుండానే కేటాయించిన పనిదినాల సంఖ్యలో ఆటోమేటిక్‌గా కోతపడుతుంది. ఏడాదిలో ఎప్పుడైనా 100 రోజుల పనిదినాలను పూర్తిచేసుకుంటామంటే ఇకపై కుదరదు.

Updated Date - 2023-03-04T01:02:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!