కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rains lash Telangana : ఐటీ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. రేపు, ఎల్లుండి..

ABN, First Publish Date - 2023-07-20T21:10:15+05:30

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ముఖ్యంగా హైదరాబాద్‌లో (Hyderabad) భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాలకు బయటికెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ బయటికెళ్తే ఎక్కడ ఇరుక్కుపోతామో తెలియదు..

Rains lash Telangana : ఐటీ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. రేపు, ఎల్లుండి..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ముఖ్యంగా హైదరాబాద్‌లో (Hyderabad) భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాలకు బయటికెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ బయటికెళ్తే ఎక్కడ ఇరుక్కుపోతామో తెలియదు. గత మూడ్రోజులుగా హైదరాబాద్‌లో ఇదే పరిస్థితి. మరోవైపు.. ఇవే భారీ వర్షాలు (Heavy Rains) మరో ఐదురోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు.. ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం, శనివారం సెలవులు ప్రకటిస్తున్నట్లు కేసీఆర్ సర్కార్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో ప్రైవేట్ సెక్టార్‌లో ఏ ఆఫీసులు తెరవడానికి వీల్లేదని ఇందుకు సంబంధించి క్లియర్‌ కట్‌గా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి.


work-from-home.jpg

ఐటీ కంపెనీలుండవ్!

ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో శుక్రవారం, శనివారం రెండ్రోజులు ఐటీ ఉద్యోగులకు (IT Employees) వర్క్ ఫ్రమ్ హోమ్‌ (Work From Home) ఇవ్వాలని ఐటీ, ఐటీఈఎస్ (IT, ITES) కంపెనీలను కేసీఆర్ ఆదేశించారు. ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా ప్రభుత్వం హెచ్చరించింది. ఈ రెండ్రోజుల పాటు హైదరాబాద్‌లో ప్రైవేట్, ప్రభుత్వం విద్యాసంస్థలు, కార్యాలయాలు తెరవడానికి వీల్లేదన్న మాట. ఈ సెలవులు ప్రకటించేలా సంబంధిత కార్మిక శాఖను కేసీఆర్ ఆదేశించారు. అయితే.. వైద్యం, పాల సరఫరా తదితర అత్యవసర సేవలు కొనసాగుతాయని.. వీరికి ఎలాంటి ఆటంకం కలిగించొద్దని సీఎం తెలిపారు.

సిద్ధంగా ఉండండి..!

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

  • భద్రాచలంలో ముంపునకు గురయ్యే అవకాశాలున్న తోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్దంగా ఉండాలి.

  • గతంలో వరదల సందర్భంగా సమర్థవంతంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలి

  • ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్‌గా పనిచేస్తున్న దురిశెట్టి అనుదీప్‌ తక్షణమే బయలుదేరి భద్రాచలం వెళ్లి అక్కడి పరిస్థితులను బట్టి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్దంగా ఉండాలి.

  • రాష్ట్ర సచివాలయంతో పాటు, కలక్టరేట్‌లో ఎమ్మార్వో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది

  • సహాయక చర్యల కోసం హెలికాఫ్టర్లను ఎన్డీఆర్‌ఎఫ్ దళాలను అందుబాటులో ఉంచాలి

  • రెవెన్యూ, పంచాయితీ రాజ్, వైద్యారోగ్యశాఖ, డిసాస్టర్ మేనేజ్మెంట్ సహా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఇందుకు సంబంధించి సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టాలి

  • ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

  • ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది.

మరోవైపు.. సీఎం ఆదేశాలమేరకు కంట్రోల్ రూం, సహా హెలీకాప్టర్లు సంబంధిత సహాయకచర్యలకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. అంతేకాకుండా భద్రాచలంలో సహాయక చర్యలకు కూడా సర్వం సిద్ధం చేసింది.


ఇవి కూడా చదవండి


TS Rains : భారీ వర్షాలతో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం.. రెండ్రోజుల పాటు సెలవులు..


Perni Nani : జగన్ సర్కార్‌పై పేర్ని నానికి ఇంత కోపమెందుకో.. మీడియా ముందే ఎందుకిలా..!?


Jr Ntr : ‘కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్’ అంటూ భారీగా ఫ్లెక్సీలు.. అసలు విషయం తెలిస్తే..?


Janasena : ఢిల్లీ వేదికగా కీలక ప్రకటన చేయనున్న పవన్.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి..!


TS Power Politics : రాహుల్‌తో పోలికేంటి కేటీఆర్.. మంత్రికి తెలిసిందల్లా ఒక్కటే.. దిమ్మదిరిగే కౌంటరిచ్చిన రేవంత్ రెడ్డి!


BRS Vs Revanth : కేటీఆర్.. ఎక్కడికి రమ్మంటావో చెప్పు.. ‘పవర్‌’పై తేల్చుకుందాం.. రేవంత్ రెడ్డి సవాల్


Chikoti Praveen : మరో వివాదంలో చికోటి ప్రవీణ్.. ఈసారి గట్టిగానే..?


Updated Date - 2023-07-20T21:17:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising