ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad TCS : హైదరాబాద్‌లో టీసీఎస్‌ కొత్త క్యాంపస్‌

ABN, First Publish Date - 2023-02-10T03:06:53+05:30

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) హైదరాబాద్‌లో మరో క్యాంప్‌సను ప్రారంభించనుంది. ఆరేడు నెలల్లో ఈ క్యాంప్‌సను ఫైనాన్షియల్‌ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటు

గత ఆర్థిక ఏడాదిలో 10,800 నియామకం

మొత్తం ఉద్యోగుల సంఖ్య 90,000

ఎలక్ట్రిక్‌ కార్లు, అటానమస్‌ డ్రైవింగ్‌ సొల్యూషన్స్‌

టెక్నాలజీ ఇన్నోవేషన్‌ కేంద్రంగా హైదరాబాద్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) హైదరాబాద్‌లో మరో క్యాంప్‌సను ప్రారంభించనుంది. ఆరేడు నెలల్లో ఈ క్యాంప్‌సను ఫైనాన్షియల్‌ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ముందుగా 700 మంది నిపుణులు పని చేయడానికి సదుపాయాలు ఉంటాయని టీసీఎస్‌ హైదరాబాద్‌ రీజినల్‌ హెడ్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, గ్లోబల్‌ హెడ్‌(కమ్యూనికేషన్స్‌, టెక్నాలజీ బిజినెస్‌) వి.రాజన్న తెలిపారు. టీసీఎ్‌సకు హైదరాబాద్‌ రెండో అతిపెద్ద కేంద్రం. ఇప్పటి వరకూ హైదరాబాద్‌లో 7 ప్రాంగణాలున్నాయి. 2006లో హైదరాబాద్‌లో 4,000 మంది ఉద్యోగులుంటే.. 2022 నాటికి వారి సంఖ్య 90 వేలకు పెరిగింది. ఇందులో 37.4ు మంది మహిళలే. ఆదిభట్ల ప్రాంగణంలో 28,000 మంది నిపుణులకు సరిపడా స్పేస్‌ ఉండగా.. ప్రస్తుతం 16,000 మంది పని చేస్తున్నారని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమలో లక్షన్నర మంది నిపుణులకు కొత్తగా కొలువులు లభిస్తే.. అందులో 10,800 మంది టీసీఎ్‌సలోనే ఉద్యోగాలు పొందారని చెప్పారు. హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో టీసీఎ్‌సకు 10-12ు వాటా ఉందన్నారు. భవిష్యత్తులో సెమీకండక్టర్‌ విభాగంలో సాఫ్ట్‌వేర్‌ నిపుణులకు భారీ ఉద్యోగావకాశాలు ఉన్నట్లు రాజన్న తెలిపారు.

ఇన్నోవేషన్‌ కేంద్రంగా హైదరాబాద్‌

టీసీఎస్‌, హైదరాబాద్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్‌కు కేంద్రంగా ఉంది. నెక్ట్స్‌ జనరేషన్‌ నెట్‌వర్క్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రం, కస్టమ్‌ సిలికాన్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రం, క్లౌడ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం వంటివి హైదరాబాద్‌లో ఉన్నాయని టీసీఎస్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌(సీటీవో) పి.ప్రసాద్‌ తెలిపారు. హైదరాబాద్‌ నుంచి టీసీఎస్‌ అంతర్జాతీయంగా 1,300 మంది క్లైంట్లకు సేవలందిస్తోందన్నారు. స్టూడెంట్‌ డెవల్‌పమెంట్‌ కార్యక్రమం కింద టీసీఎస్‌ హైదరాబాద్‌ కొత్త తరం టెక్నాలజీల్లో 20 వేల మంది విద్యార్థులకు అండగా నిలిచిందని వివరించారు. యూత్‌ ఎంప్లాయిమెంట్‌ ప్రోగ్రామ్‌ కింద 4,000 మందికి శిక్షణ ఇచ్చిందన్నారు.

ఎలక్ట్రిక్‌ కార్ల అభివృద్ధి..

ప్రముఖ కార్ల కంపెనీ(ఒరిజినల్‌ ఎక్వి్‌పమెంట్‌ మ్యానుఫ్యాక్చరర్‌ - ఓఈఎం)తో కలిసి భారత్‌ కోసం టీసీఎస్‌ ఎలక్ట్రిక్‌ కారును అభివృద్ధి చేస్తోంది. ఎలక్ట్రిక్‌ కార్ల వాడకం.. చార్జింగ్‌ టెక్నాలజీ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని టీసీఎస్‌ గ్లోబల్‌ హెడ్‌(ఐవోటీ, డిజిటిల్‌ ఇంజనీరింగ్‌) అయ్యస్వామి తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించి గోవాలో టీసీఎ్‌సకు ప్రోటోటైప్‌ ఉత్పత్తులను తయారు చేసే కేంద్రం ఉంది. వైర్‌లెస్‌ చార్జింగ్‌ సిస్టమ్‌(వీసీఎస్‌), బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌(బీఎంఎస్‌) వంటి వాటిని టీసీఎస్‌ అభివృద్ధి చేస్తోందని ఆయన చెప్పారు.

అటానమస్‌ డ్రైవింగ్‌ సొల్యూషన్లు..

అటానమస్‌ డ్రైవింగ్‌, కనెక్టెడ్‌ సర్వీసెస్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌ కోసం టీసీఎస్‌ ఆటోమోటివ్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌-- ఆటోమోటివ్‌ సొల్యూషన్లను అభివృద్ధి చేస్తోంది. అటానమస్‌ డ్రైవింగ్‌లో లెవల్‌-4 వరకూ వివిధ ఫీచర్లుంటాయి. సెల్ఫ్‌ పార్కింగ్‌, పార్కింగ్‌ ప్లేస్‌ గుర్తింపు, లేన్‌ చేంజింగ్‌, కంట్రోల్‌ సిస్టమ్‌ వంటి అటానమస్‌ వెహికల్‌ సొల్యూషన్లను టీసీఎస్‌ అభివృద్ధి చేస్తోందని అయ్యస్వామి తెలిపారు. మూడు ప్రోటోటైప్‌ అటానమస్‌ కార్ల ను కంపెనీ పరీక్షిస్తోంది. అటానమస్‌ కారుకు డేటా వేగం సెకనుకు 1జీబీ మేర అవసరం అవుతుంది. 144 టెరాఫ్లాప్స్‌ కంప్యూటేషనల్‌ పవర్‌ కావాలి. రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌లో వచ్చే కార్లను ఆబ్జెక్ట్‌ డిటెక్షన్‌ అల్గారిథమ్‌ గుర్తించగలదని తెలిపారు. ప్రస్తుతం లెవల్‌-2 ఫీచర్లు కలిగిన అటానమస్‌ డ్రైవింగ్‌ కారు వరకూ ఖాతాదారులు కొనగలిగే పరిస్థితి ఉందని వివరించారు.

Updated Date - 2023-02-10T03:06:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising