Indrakaran Reddy : పేపర్ లీకేజీల వ్యవహారంలో బీజేపీ అసలు రంగు బయట పడింది
ABN, First Publish Date - 2023-04-05T13:49:12+05:30
పేపర్ లీకేజీల వ్యవహారంలో బీజేపీ అసలు రంగు బయట పడిందినిర్మల్ : పేపర్ లీకేజీల వ్యవహారంలో బీజేపీ అసలు రంగు బయట పడిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
Indrakaran Reddy : పేపర్ లీకేజీల వ్యవహారంలో బీజేపీ అసలు రంగు బయట పడిందినిర్మల్ : పేపర్ లీకేజీల వ్యవహారంలో బీజేపీ అసలు రంగు బయట పడిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. లీకేజీ నిందితుడికి బండి సంజయ్ సహా బీజేపీ నేతలతో ప్రత్యక్ష సంబంధాలున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్‌లో ఇదంతా జరుగుతోందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో అలజడి సృష్టించాలని బీజేపీ చూస్తోందన్నారు. పథకం ప్రకారమే ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారన్నారు. దోషులు ఎంతటి వారైనా విడిచిపెట్టబోమని ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేశారు. కరీంనగర్ జ్యోతి నగర్‌లోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లారు. పదో తరగతి పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి, వరుసగా రెండో రోజు మంగళవారం కూడా పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాట్సా్‌పలో ప్రత్యక్షమైంది. హనుమకొండలో హెచ్‌ఎంటీవీ బ్యూరో మాజీ చీఫ్ బూరం ప్రశాంత్ ‘బ్రేకింగ్ న్యూస్’ అంటూ దానిని వైరల్ చేశాడు. హిందీ ప్రశ్న పత్రం లీకైందని, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారంటూ బండి సంజయ్‌తోపాటు చాలామందికి దానిని ఫార్వార్డ్ చేశాడు. ఈ నేపథ్యంలో, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడిచింది.
Updated Date - 2023-04-05T13:49:12+05:30 IST