TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితుల విచారణ
ABN, First Publish Date - 2023-03-19T18:32:05+05:30
టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీక్ కేసులో నిందితులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. సిట్ కార్యాలయంలో ఐదు గంటలుగా విచారణ కొనసాగుతోంది.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీక్ కేసులో నిందితులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. సిట్ కార్యాలయంలో ఐదు గంటలుగా విచారణ కొనసాగుతోంది. మరికాసేపట్లో రెండోరోజు సిట్ విచారణ ముగియనుంది. రెండు గంటల పాటు ముగ్గురు నిందితులను విడివిడిగాను, మరోసారి ముగ్గురిని కలిపి సిట్ చీఫ్ ఎ.ఆర్.శ్రీనివాస్ ప్రశ్నించారు. క్వశ్చన్ పేపర్స్ (Question Papers) ఎలా లీక్ చేశారు? వీరి వెనుక ఎవరున్నారు?.. ఆర్ధిక లావాదేవీలు ఎలా జరిగాయి? అని సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాన్ఫిడెన్షియల్ కార్యాలయం నుంచి సీపీయూ, హార్డ్ డెస్క్ (CPU Hard Desk)ను సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ పరిశీలించారు. టెక్నికల్ టీం సహాయంతో పలు కీలక అంశాలను ఏసీపీ ప్రసాద్ రాబట్టారు. ఐపీ అడ్రస్లు మార్చేసి, కంప్యూటర్లోకి లాగిన్ అయి.. క్వశ్చన్ పేపర్స్ చోరీ చేసినట్లు రాజశేఖర్ తెలిపాడు. రాజశేఖర్ నుంచి ప్రవీణ్, రేణుక ద్వారా.. పేపర్లు చేతులు మారినట్లు స్టేట్మెంట్లు తీసుకున్నారు. రాజశేఖర్, ప్రవీణ్, రేణుక, డాక్యా, రాజేశ్వర్, గోపాల్, రాజేంద్ర, నీలేష్, శ్రీనివాస్ల పాత్రలపై వాంగ్మూలాన్ని అధికారులు రికార్డ్ చేశారు. టెక్నికల్ విషయాలపై ప్రవీణ్, రాజశేఖర్ సంబంధాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఏఈ పేపర్తో పాటు టౌన్ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష పత్రాలు కాపీ చేసినట్లు సిట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అక్టోబర్ 16న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్తో పాటు ఏఈఈ, డీఏఓ పరీక్ష ప్రశ్నాపత్రాలను ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి లీక్ చేశాడు.
Updated Date - 2023-03-19T18:32:15+05:30 IST