ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Harish Rao : గవర్నర్‌ను పిలవాలని రూల్‌ ఉందా?

ABN, First Publish Date - 2023-05-05T03:26:31+05:30

రాజకీయమే చేయాలనుకుంటే ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయాలని, అంతేకానీ బిల్లులు ఆమోదించకుండా అభివృద్ధికి అడ్డుపడటం తగదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు సూచించారు. గవర్నర్‌కు రాష్ట్ర అభివృద్ధి,

Minister Harish Rao
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్లమెంటు శంకుస్థాపనకు రాష్ట్రపతిని పిలిచారా

రాజకీయమే చేయాలంటే ఎన్నికల బరిలోకి దిగండి

బిల్లులు ఆమోదించకుండా అడ్డుపడటం తగదు

రాజ్‌భవన్‌కు మేం ఎందుకెళ్లాలి?

మీడియాతో చిట్‌చాట్‌లో హరీశ్‌

తెలంగాణ రైతులను ఆదుకోవాలని ప్రధానికి లేఖ రాయండి

గవర్నర్‌కు మంత్రి గంగుల సూచన

హైదరాబాద్‌/కరీంనగర్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): రాజకీయమే చేయాలనుకుంటే ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయాలని, అంతేకానీ బిల్లులు ఆమోదించకుండా అభివృద్ధికి అడ్డుపడటం తగదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు సూచించారు. గవర్నర్‌కు రాష్ట్ర అభివృద్ధి, నిరుద్యోగుల సమస్యలు తీర్చాలన్న ఆలోచనే లేదని ఆరోపించారు. ఆమె బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఆమె బీజేపీ నేతగా ఎన్నికల్లో... అదీ తెలంగాణలోనే పోటీ చేయాలనుకుంటే ‘మా సిద్ధిపేటలో పోటీ చేస్తారా.. రమ్మని చెప్పండి’ అని వ్యాఖ్యానించారు. సచివాలయం ప్రారంభానికి గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలోనే ఏమైనా రాసి ఉందా? అని ప్రశ్నించారు. గురువారం బీఆర్‌ఎస్‌ఎల్పీలో మీడియాతో చిట్‌ చాట్‌లో గవర్నర్‌ తీరుపై ఘాటుగా స్పందించారు. ‘రాజ్‌భవన్‌కు మేం ఎందుకు వెళ్లాలి. గవర్నర్‌ పిలిస్తే మా మంత్రి సబిత, సీఎస్‌ శాంతికుమారి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు వెళ్లలేదా? రాజ్‌భవన్‌కు సచివాలయానికి దూరం పెరిగిందంటూ గవర్నర్‌ ఓ రాజకీయ నాయకురాలిలాగా మాట్లాడుతున్నారు’ అని ఆయన ఆరోపించారు. బీజేపీ నేతలు మాత్రం అన్ని వేళల్లో రాజ్‌భవన్‌కు వెళ్తారని, వారికి ప్రవేశం ఉంటుందన్నారు. అదే తమ జీహెచ్‌ఎంసీ మేయర్‌ అపాయింట్‌మెంట్‌ కోరితే గవర్నర్‌ స్పందించరని, ఇది దేనికి సంకేతమని ప్రశ్నించారు. సచివాలయం ప్రారంభానికి తనను ఆహ్వానించలేదని గవర్నర్‌ బహిరంగంగా వ్యాఖ్యానించడం తగదన్నారు. హైదరాబాద్‌ న్యూయార్క్‌లాగా అభివృద్ధి చెందిందని సినీ నటుడు రజనీకాంత్‌ పొగిడితే రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా ఉన్న గవర్నర్‌ రాష్ట్ర ప్రతిష్ఠను తగ్గించేలా ప్రపంచ దేశాలకు సంబంధించిన జీ 20 సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజ్యాంగబద్ధంగా శాసనసభ ఆమోదించిన బిల్లులను రాజకీయ దురుద్దేశంతోనే గవర్నర్‌ ఆమోదించలేదని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తున్నారని హరీశ్‌ విమర్శించారు. రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌ను తాము గౌరవిస్తామని, అందుకే విమర్శలు చేయడం లేదన్నారు. సచివాలయం ప్రారంభానికి గవర్నర్‌ను రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉందా? అని ప్రశ్నించిన ఆయన కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో తొలి అసెంబ్లీ సమావేశానికి, హైకోర్టు జస్టిస్‌ ప్రమాణ స్వీకారానికి ఇలా గవర్నర్‌ ఎప్పుడెప్పుడు పిలవాలన్నది విధి విధానాల్లో ఉందని, ఆ ప్రకారమే పిలుస్తామన్నారు. ఏయే కార్యక్రమాలకు ఎవరిని పిలవాలన్నది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల ఇష్టమని పేర్కొన్నారు. ‘నూతన పార్లమెంటు శంకుస్థాపనకు రాష్ట్రపతిని ప్రధాని మోదీ పిలిచారా? వందే భారత్‌ రైలు ప్రారంభానికైనా పిలిచారా? దీన్ని మేం ప్రశ్నించడం లేదు కదా! కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాల సొంత నిర్ణయమ’ని వెల్లడించారు.

సుప్రీం కోర్టుకు వెళ్లాకే...

రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ ఆమోదించకపోవడంతో ఏడు నెలలు వేచి చూసి సుప్రీం కోర్టును ఆశ్రయించామని హరీశ్‌ చెప్పారు. ఆ వెంటనే గవర్నర్‌ స్పందించారని, కొన్ని బిల్లులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపడమే కాకుండా ఒక బిల్లును రాష్ట్రపతికి సిఫారసు చేశారన్నారు. కేవలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య వినతిపత్రం ఇచ్చారని భద్రాచలం విలీన గ్రామాల బిల్లును గవర్నర్‌ ఆపారని, కేబినెట్‌ తీర్మానించిన బిల్లులను నిలిపేయడం వెనుక రాజకీయ దురుద్ధేశం కనబడుతోందన్నారు. యూనివర్శిటీ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు సంబంధించిన బిల్లును ఆమోదించకుండా గవర్నర్‌ కాలయాపన చేయడం వల్ల రాష్ట్రంలోని యూనివర్శిటీల్లో నియామకాలు జరగక నిరుద్యోగులు, విద్యార్థులకు ఇబ్బంది కలుగుతోందన్నారు. పలు రాష్ట్రాల్లో యూనివర్శిటీల కామన్‌ రిక్రూట్‌మెంట్‌ విధానం అమలుల్లో ఉందని, అయినా ఇక్కడ ఆమోదించలేదన్నారు. వైద్య కళాశాలల్లో పనిచేసే ప్రొఫెసర్ల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వుల్లో కొన్ని అంశాలను చేర్చలేదని సవరిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును సైతం పెండింగ్‌లో పెట్టారన్నారు. దీంతో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మెడికల్‌ కళాశాలల్లో ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్‌ పోస్టులతోపాటు ఏడీఎంఈ, డీఎంఈ పోస్టులపై సందిగ్ధత నెలకొందన్నారు. ‘గవర్నర్‌కు పంపిన బిల్లుల్లో రాజ్యాంగ విరుద్ధమైన అంశాలు ఏమైనా ఉన్నాయా? ప్రజలకు నష్టం కలిగించే ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా? అనేది చూడాలి. అంతేకానీ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ప్రతిపాదనలను ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచడం అన్యాయమ’ని విమర్శించారు. గతంలో 5 ప్రైవేటు యూనివర్శిటీలకు ఆమోదం తెలిపిన గవర్నర్‌ ఇప్పుడు ఏ ఉద్దేశంతో ప్రైవేటు యూనివర్శిటీలను అనుమతించలేదో అర్థం కావడం లేదన్నారు. మునిసిపాలిటీల్లో అవిశ్వాసాలను నాలుగేళ్లకు పెంచాలన్న ప్రతిపాదనను కూడా ఆమోదించలేదని పేర్కొన్నారు.

ప్రధానికి గవర్నర్‌ లేఖ రాయాలి

కాల వర్షాలు అన్నదాతలను తీవ్రంగా నష్టపరచడం దురదృష్టకరమని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ రైతులను ఆదుకోవాలని ప్రధానికి గవర్నర్‌ తమిళిసై లేఖ రాయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు. రాష్ట్ర ప్రజలు చెల్లిస్తున్న జీఎస్టీతో ఎంజాయ్‌ చేస్తున్న కేంద్రం రాష్ట్ర ప్రజలు, రైతులు కష్టాల్లో ఉంటే సహకరించకపోవడం దారుణమన్నారు. తెలంగాణ ప్రజలు దేశంలో భాగం కాదా అని కేంద్రాన్ని, గవర్నర్‌ను ప్రశ్నించారు. గవర్నర్‌, కేంద్ర మంత్రులు, ఎంపీలు చేయాల్సింది రాజకీయాలు కాదని, రాష్ట్ర ప్రజలకు, రైతులకు మద్దతుగా ఉండాలన్నారు. ఎఫ్‌సీఐ నిబంధనలను సడలించాలని డిమాండ్‌ చేశారు. గంగుల గురువారం కరీంనగర్‌ జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు.

Updated Date - 2023-05-05T03:26:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising