ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nizamabad Govt Hospital: ఇదేనా కేసీఆర్ చెబుతున్న తెలంగాణ మోడల్? : రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2023-04-15T15:12:37+05:30

నిజామాబాద్‌ ఆస్పత్రి (Nizamabad Govt Hospital) లో జరిగిన ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (TPCC President Revanth Reddy) సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇదేనా సీఎం కేసీఆర్ (CM KCR) చెబుతున్న తెలంగాణ మోడల్? అని ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: నిజామాబాద్‌ ఆస్పత్రి (Nizamabad Govt Hospital) లో జరిగిన ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (TPCC President Revanth Reddy) సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇదేనా సీఎం కేసీఆర్ (CM KCR) చెబుతున్న తెలంగాణ మోడల్? అని ప్రశ్నించారు. నిజామాబాద్‌ ఆస్పత్రిలో వసతుల లేమీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని తప్పుబట్టారు. రోగిని బంధువులు ఈడ్చుకెళ్లడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట కాదా అని నిలదీశారు. బీఆర్‌ఎస్ (BRS) సర్కార్ అరాచక పాలన ఫలితమే ఈ ఘటన అని రేవంత్‌రెడ్డి అన్నారు.

నిజామాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో గత నెల 31న ఓ రోగి చేరాడు. అయితే చికిత్స నిమిత్తం ఆస్పత్రి రెండో అంతస్తుకు వెళ్లాల్సి ఉండగా.. అక్కడ స్ట్రెచర్‌ లేక రోగిని బంధువులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. లిఫ్ట్‌ వరకు రోగి కాళ్లుపట్టుకుని బంధువులు లాక్కెళ్లారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారాయి. రోగిని ఆస్పత్రిలోకి తీసుకెళ్లేందుకు సిబ్బంది సాయం చెయ్యకపోవడంతో, ఆస్పత్రి సిబ్బంది తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. రోగులకు అందుబాటులో స్ట్రెచర్‌ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.

అయితే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో స్ట్రెచర్ లేకపోవడంతో ఓ రోగిని కాళ్ళు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ స్పందించారు. రోగిపట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించారు. ఆస్పత్రికి వచ్చిన రోగికి చికిత్స అందించే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. రోగిని వైద్య పరీక్షల కోసం రెండో అంతస్తుకు తీసుకెళ్లాల్సి ఉందని తెలిపారు. సిబ్బంది వీల్ చైర్ తీసుకొచ్చేలోపే లిఫ్ట్ వచ్చిందని వారి తల్లిదండ్రులు రోగిని లాగుతూ తీసుకెళ్లారని వివరించారు.

Updated Date - 2023-04-15T15:12:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising