నక్కలగండి భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
ABN, First Publish Date - 2023-01-05T00:01:30+05:30
నక్కలగండి భూనిర్వాసితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిహారం, పునరావాసం కల్పిస్తుందని ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నక్కలగండి రిజర్వాయర్ కింద భూమి, ఇళ్లు కోల్పోయిన నక్కలగండి, మోత్యాతండా భూనిర్వాసితులకు ప్రభుత్వం మంజూరుచేసిన రూ.25లక్షల చెక్కులను భూనిర్వాసితులకు పంపిణీ చేసి మాట్లాడారు.
నక్కలగండి భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్
దేవరకొండ, జనవరి 4: నక్కలగండి భూనిర్వాసితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిహారం, పునరావాసం కల్పిస్తుందని ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నక్కలగండి రిజర్వాయర్ కింద భూమి, ఇళ్లు కోల్పోయిన నక్కలగండి, మోత్యాతండా భూనిర్వాసితులకు ప్రభుత్వం మంజూరుచేసిన రూ.25లక్షల చెక్కులను భూనిర్వాసితులకు పంపిణీ చేసి మాట్లాడారు. ముంపునకు గురవుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండి పునరావాసం, పూర్తిస్థాయిలో పరిహారం అందజేసి ఆదుకుంటుందన్నారు. ప్రా జెక్టు నిర్మాణ పనులకు సహకరించాలని ఆయన భూనిర్వాసితులను కోరా రు. కార్యక్రమంలో ఆర్డీవో గోపిరాం, జడ్పీటీసీ కంకణాల ప్రవీణ వెంకట్‌రె డ్డి, నాయకులు ఉజ్జిని విద్యాసాగర్, రాజినేని వెంకటేశ్వరరావు, నాగార్జునరె డ్డి తదితరులు పాల్గొన్నారు.
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి
చందంపేట: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని ఎమ్మె ల్యే రవీంద్రకుమార్ అన్నారు. మండలంలోని గన్నేర్లపల్లి స్టేజీ వద్ద బీఆర్‌ఎస్ నాయకుడు దివంగత రమావత లాలునాయక్ స్మారక జిల్లాస్థాయి క్రి కెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సర్వయ్య, నాయకులు మల్లారెడ్డి, గోసుల అనంతగిరి, మోహనకృష్ణ, వీరారెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2023-01-05T00:01:32+05:30 IST