ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ రద్దు!

ABN, First Publish Date - 2023-10-29T05:58:04+05:30

కామారెడ్డి మున్సిపాలిటీ ప్రతిపాదిత మాస్టర్‌ ప్లాన్‌ను రద్దు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

రైతులు ఆందోళన చెందొద్దు

వారిపై ఉన్న కేసులూ తొలగిస్తాం: కేటీఆర్‌

హామీలు.. ప్రగతిభవన్‌లో భేటీ

కామారెడ్డి టౌన్‌, అక్టోబరు 28: కామారెడ్డి మున్సిపాలిటీ ప్రతిపాదిత మాస్టర్‌ ప్లాన్‌ను రద్దు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మాస్టర్‌ప్లాన్‌ బాధిత రైతులతో ఆయన సమావేశమయ్యారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తాము తోడుగా ఉంటామని ఈ సంద ర్భంగా చెప్పారు. మాస్టర్‌ప్లాన్‌ రద్దుకు సంబంధించి మున్సిపాలిటీ కౌన్సిల్‌ ఇప్పటికే తీర్మానం చేసిందని గుర్తు చేశారు. పాత మాస్టర్‌ప్లాన్‌ ప్రకారమే నడుచుకోవాలని డీటీసీపీ అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు. మరోవైపు, మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జరిపిన నిరసన కార్యక్రమాల్లో బాధిత రైతులపై నమోదైన కేసులను కూడా ఉపసంహరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు కామారెడ్డి ఎస్పీ నుంచి వివరాలు తెలుసుకున్నారు. కేటీఆర్‌కు రైతులు ఽధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత నిట్టు వేణుగోపాల్‌రావు, రైతు జేఏసీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

ప్లాన్‌కు వ్యతిరేకంగా ఉద్యమం

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌ను 11 నెలల క్రితం ప్రతిపాదించింది. ఆ ప్లాన్‌ వల్ల తాము భూములను కోల్పోతామంటూ రైతులు పెద్ద ఎత్తున ఉద్య మం చేపట్టారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చి మాస్టర్‌ప్లాన్‌ను అమలు చేయబోమని ప్రకటించింది. అయితే కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తుండటంతో మాస్టర్‌ప్లాన్‌ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ప్లాన్‌ను రద్దు చేస్తూ అధికారిక ప్రకటన చేయాలని, లేదంటే కేసీఆర్‌పై 100కు పైగా నామినేషన్‌లు వేస్తామని రైతు జేఏసీ ప్రకటించింది. దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ మేరకు బాధిత రైతులతో కేటీఆర్‌ సమావేశం జరిగింది.

Updated Date - 2023-10-29T05:58:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising