ధర్మపురి పట్టణాభివృద్ధికి ప్రత్యేక కృషి
ABN, First Publish Date - 2023-10-10T00:57:35+05:30
ధర్మపురి పట్టణాభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చే స్తున్నట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. పట్ట ణంలోని గిరుకలవాడ, నర్సయ్యపల్లె, సంగివాడ, పద్మశాలివాడ, తెనుగువా డ తదితర వార్డుల్లో రూ 15 కోట్ల మున్సిపల్, ఎస్‌డీఎఫ్ నిధులచే సీసీ రో డ్లు, ఇతరత్రా అభివృద్ధి పనులకు సోమవారం ఉదయం ఆయన శంకు స్థాపన చేశారు.
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మపురి, అక్టోబరు 9: ధర్మపురి పట్టణాభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చే స్తున్నట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. పట్ట ణంలోని గిరుకలవాడ, నర్సయ్యపల్లె, సంగివాడ, పద్మశాలివాడ, తెనుగువా డ తదితర వార్డుల్లో రూ 15 కోట్ల మున్సిపల్, ఎస్‌డీఎఫ్ నిధులచే సీసీ రో డ్లు, ఇతరత్రా అభివృద్ధి పనులకు సోమవారం ఉదయం ఆయన శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలో నెలకొ న్న రోడ్ల దుస్థితి గురించి ఆయా వార్డులకు చెందిన ప్రజా ప్రతినిధులు త న దృష్టికి తీసుకువచ్చామన్నారు. దీంతో సంబంధిత శాఖ అధికారులచే స ర్వే చేయించి పనుల కోసం అంచనాలు రూపొందించి ప్రభుతానికి నివేది క పంపించామన్నారు. వెంటనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృ ష్టి సారించి నిధులు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ని ధులతో త్వరగా పనులు పూర్తి జరిగితే పట్టణంలో రోడ్లు ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటాయని మంత్రి ఈశ్వర్ తెలిపారు. అభివృద్ధి నిరోధ కుల ను ప్రజలు దూరంగా ఉంచాలని ఆయన సూచించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతున్న తనకు, బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సి పల్ చైర్ పర్సన్ సంగి సత్యమ్మ, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరు రాజేష్‌కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇం దారపు రామయ్య, కమీషనర్ రమేష్, కౌన్సిలర్లు అయ్యోరు వేణుగోపాల్, తరాల్ల కార్తీక్, గుర్రాల సుధాకర్, తిరుమన్‌దాస్ అశోక్, కొంపల పద్మ, అనంతులు విజయలక్ష్మి, సయ్యద్ యూనస్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ అలీమొద్దీన్, షబ్బీర్, ఇక్రం, ఆసిఫ్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు ఆకుల రా జేష్, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2023-10-10T00:57:35+05:30 IST