గంజాయి అమ్మినా, కొన్నా చర్యలు
ABN, First Publish Date - 2023-04-22T00:10:32+05:30
గంజాయి అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు ఉం టాయని, యువత గంజాయి మత్తుకు లోనుకావద్దని గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్ పిలుపునిచ్చారు.
కోల్‌సిటీ, ఏప్రిల్ 21: గంజాయి అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు ఉం టాయని, యువత గంజాయి మత్తుకు లోనుకావద్దని గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్ పిలుపునిచ్చారు. కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గోదావరిఖని ఇందిరానగర్‌లో ఆకస్మిక తనిఖీ చేసి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని 42మోటార్‌సైకిళ్లను, నాలుగు ఆటోలను, ఒక కారును సీజ్ చేశారు. ఎవరైనా అనుమానితులు, కొత్తవ్యక్తులు సంచరిస్తే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని, ప్రజల రక్షణ కోసం పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. స్ర్కాప్ దుకాణం నిర్వహించే వారు ఎవరైనా కొత్త వ్యక్తులు సింగరేణి, రైల్వే, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు సంబంధించిన రాగి, ఇనుము తీసుకువస్తే తమకు సమాచారం ఇవ్వాలని, లేకుంటే స్ర్కాప్ యజమానులపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటమాని హెచ్చరించారు. అత్యాశకు పోయి ఎవరైనా మొబైల్స్‌కు ఓటీపీలు, మెసేజ్‌లు వస్తే లింకులు ఓపెన్ చేయవద్దన్నారు. ఇందిరానగర్‌లో సీసీకెమెరాల ఏర్పాటుతో నేరాలను నియం త్రిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐలు ప్రమోద్‌రావు, ప్రసాద్‌రావు, రామగుండం సీఐ చంద్రశేఖర్, టుటౌన్ సీఐలు వేణుగోపాల్, అఫ్జలుద్దీన్, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, డిస్ర్టిక్ గార్డులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-22T00:10:32+05:30 IST