అమ్మకు సాయం ఏదీ..?
ABN, First Publish Date - 2023-06-25T00:40:40+05:30
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడానికి ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా గర్భి ణులకు, బాలింతలకు రావాల్సిన ప్రోత్సాహక నగదు అందడం లేదు. కేవలం కేసీఆర్ కిట్‌తో మాత్రమే సరిపెడుతున్నారు. ఫలితంగా అర్హులకు నిరాశే మిగులుతోంది. జిల్లాలో వేలాది మంది మహిళలకు డబ్బులు రా వాల్సి ఉంది. గర్భిణులు, బాలింతలకు మూడున్నర నెలల టీకాలు, తొమ్మి ది నెలల టీకాల అనంతరం నాలుగు విడతల్లో ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది.
- గర్భిణులు, బాలింతలకు అందని ప్రోత్సాహక నగదు
- మూడేళ్లుగా తప్పని ఎదురుచూపులు
- జిల్లాలో రూ. 14.92 కోట్ల బకాయిలు
జగిత్యాల, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడానికి ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా గర్భి ణులకు, బాలింతలకు రావాల్సిన ప్రోత్సాహక నగదు అందడం లేదు. కేవలం కేసీఆర్ కిట్‌తో మాత్రమే సరిపెడుతున్నారు. ఫలితంగా అర్హులకు నిరాశే మిగులుతోంది. జిల్లాలో వేలాది మంది మహిళలకు డబ్బులు రా వాల్సి ఉంది. గర్భిణులు, బాలింతలకు మూడున్నర నెలల టీకాలు, తొమ్మి ది నెలల టీకాల అనంతరం నాలుగు విడతల్లో ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. గర్భం దాల్చిన మూడు నెలల్లోపు ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తల వద్ద పేరు నమోదు చేయించుకొని క్రమం తప్పకుండా వైద్య పరీక్షలకు రావాల్సి ఉంటుంది. ప్రసవించిన అనంతరం పిల్లలకు టీకాలు వేయించే తల్లికి నాలుగు విడతల్లో నగదు అందించాల్సి ఉంది. మగ శిశువు జన్మిస్తే రూ. 12 వేలు, ఆడ పిల్ల పుడితే రూ. 13 వేలు ప్రభుత్వం ఇస్తుంది.
నడిచొచ్చే వయస్సు వచ్చిన నగదు రాలే..
మూడు నెలల గర్భం దాల్చిన వెంటనే ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎం, అం గన్‌వాడీ కేంద్రాల్లో పేరు నమోదు చేసుకోవడంతో కేసీఆర్ కిట్ పో ర్టల్‌లో పొందుపర్చుతారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు వైద్య పరీక్షలు పూర్త య్యాక ఆమె ఖాతాలో మొదటి విడతలో భాగంగా రూ. 3 వేలు జమ చే యాల్సి ఉంటుంది. కాన్ను కాగానే ఆడపిల్ల అయితే రెండో విడతలో భా గంగా రూ. 5 వేలు, మగ శిశువు అయితే రూ. 4 వేలతో పాటు రూ. 2 వేల విలువ గల కేసీఆర్ కిట్ అందజేయాలి. మూడో విడతలో మూ డున్నర నెలలకు టీకా తీసుకున్న అనంతరం రూ. 2 వేలు, నాలుగో విడ తలో 9 నెలల టీకా పూర్తయిన వెంటనే తల్లి ఖాతాల్లో మరో రూ. 3 వేలు జమ కావాల్సి ఉంటుంది. అయితే సంబంధిత నగదు ప్రోత్సాహకం దా దాపు మూడేళ్లుగా జమ కావడం లేదు. పుట్టిన పిల్లాడికి నడిచొచ్చే వ యస్సు వచ్చినా నగదు అందడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
జిల్లాలో రూ. 14.92 కోట్ల నగదు ప్రోత్సాహక బకాయిలు..
జిల్లా వ్యాప్తంగా సుమారు 48,101 మంది గర్భిణులు, బాలింతలకు రూ. 14,92,67,000 నగదు ప్రోత్సాహకం అందాల్సి ఉంది. ఇందులో మొ దటి విడతలో 16,332 మంది మహిళలకు రూ. 4,89,96,000, రెండవ విడతలో 10,823 మంది మహిళలకు రూ. 4,87,03,000, మూడో విడతలో 11,270 మంది మహిళలకు రూ. 2,25,40,000, నాలుగో విడతలో 9,676 మంది మహిళలకు రూ. 2,90,28,000 ప్రోత్సాహక నగదు బకాయి లున్నాయి.
నగదు రాలేదు
- నాగిరెడ్డి రక్షిత, పోతారం గ్రామం, సారంగపూర్ మండలం
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం పొందాను. కుమారుడు జ న్మించాడు. నాలుగు నెలలు గడుస్తున్నా ప్రోత్సాహక నగదు రాలేదు. కేసీ ఆర్ కిట్ మాత్రమే ఇచ్చారు. ఇప్పటివరకు ఆర్థిక సహాయం కోసం ఎదు రుచూపులు తప్పడం లేదు.
ఎప్పటికప్పుడు వివరాలు నివేదిస్తున్నాం
- పుప్పాల శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, జగిత్యాల
జిల్లాలో కేసీఆర్ కిట్ పథకం కింద అర్హులైన గర్బిణులు, బాలింతల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నాము. నిధులు రాగా నే అర్హుల బ్యాంకు ఖాతాల్లో ప్రోత్సాహక నగదు జమవుతుంది. అర్హులైన ప్రతీ మహిలకు ప్రోత్సాహక నగదు అందేలా చూస్తున్నాము.
Updated Date - 2023-06-25T00:40:40+05:30 IST