బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధి తుది నివేదిక సిద్ధం
ABN, First Publish Date - 2023-04-08T00:47:46+05:30
వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవ స్థానం అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం అభి వృద్ధికి సంబంధించిన తుది నివేదిక సిద్ధమైందని స్థానిక ఎమ్మెల్యే చెన్న మనేని రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
వేములవాడ, ఏప్రిల్ 7: వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవ స్థానం అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం అభి వృద్ధికి సంబంధించిన తుది నివేదిక సిద్ధమైందని స్థానిక ఎమ్మెల్యే చెన్న మనేని రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజరాజేశ్వరస్వామివారి దేవ స్థానం అభివృద్ధి పనుల్లో భాగంగా బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ కోసం 18 కోట్ల 50 లక్షల రూపాయలతో సేకరించిన ఎకరం స్థలంలో అధునాతన వసతి సౌకర్యాలతో చేపట్టనున్న పనులకు సంబంధించి ఆలయ డీఈ మధు రఘునందన్‌తో శుక్రవారం చర్చించినట్లు వెల్లడించారు. 10 కోట్ల రూపాయలతో బోనాల మండపం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టేం దుకు ఇప్పటికే నివేదికలు రూపొందించగా, వీటిలో మార్పులు చేర్పులపై చర్చించినట్లు తెలిపారు. భక్తులకు అధునాతన వసతి సౌకర్యాలు కల్పించడంతోపాటు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే విధంగా చూస్తామని, 12 కోట్ల రూపాయలతో బండ్ ఆధునికీకరణ చేపట్టేందుకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో నివేదికలు రూపొందుతున్నాయని పేర్కొన్నారు.
Updated Date - 2023-04-08T00:47:46+05:30 IST