ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మెరుగైన పథకాలు

ABN, First Publish Date - 2023-11-29T00:19:16+05:30

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడితే మెరుగైన పథ కాలు అమలవుతాయని పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు స్ప ష్టంచేశారు. జిల్లా కేంద్రం వ్యవసాయ మార్కెట్‌ నుంచి కమాన్‌ మీదుగా జెండా చౌరస్తాకు చేరుకున్న ర్యాలీలో విజయరమణారావు మాట్లాడారు.

పెద్దపల్లిటౌన్‌, నవంబరు 28: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడితే మెరుగైన పథ కాలు అమలవుతాయని పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు స్ప ష్టంచేశారు. జిల్లా కేంద్రం వ్యవసాయ మార్కెట్‌ నుంచి కమాన్‌ మీదుగా జెండా చౌరస్తాకు చేరుకున్న ర్యాలీలో విజయరమణారావు మాట్లాడారు. కాం గ్రెస్‌ పార్టీ సంక్షేమ పథకాలపై ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు ప్ర జలను తప్పుదోవ పట్టిస్తున్నారని, గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలు అమలుచేసిన సంగతి ప్రజలు గుర్తుకు చేసుకోవాలని సూచించారు అని ప్రశ్నించారు. 10 ఏళ్ల బీఆర్‌ఎస్‌ పాలన ముఖ్యమంత్రి సీఎం,ఇక్కడ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిలు నియం తలుగా వ్యవహరించడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని వివరించారు. ఏడా దిక్రితం పెద్దపల్లికి వచ్చిన సీఎం ప్రకటించిన నిధులు ఏవని ప్రశ్నించారు. మాయమాటలు చెప్పి ప్రజలను గారడీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి రేకులు ఎత్తుకెళ్లింది, చెరువు మట్టి అమ్ముకున్నది, ఇసుక మాఫియాకు తెరలేపింది, నిజంకాదా అని ప్రశ్నించారు. రైస్‌మిల్లర్లతో కుమ్ముక్కై క్వింటాల్‌ 10కిలోల పైచిలుకు వరి ధాన్యం కటింగ్‌ చేసి రైతులను నట్టేట ముంచాడన్నారు. దాసరి మనోహర్‌రెడ్డి పైసలతో ఓటు కొనాలని చూస్తున్నాడని, ఎంతిచ్చినా తీసుకొని కాంగ్రెస్‌ పార్టీ చేతి గుర్తుకు ఓటువేయాలన్నారు.

ఉచిత కరెంటు తెచ్చింది కాంగ్రెస్సే..

- మంథని ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్‌ బాబు

రైతులకు వ్యవసాయానికి ఉచిత కరెంటు అందిం చింది కాంగ్రెస్‌ మాత్రమేనని, విడతల వారిగా సరఫ రా గంటలు పెంచిందని, 24 గంటల ఇచ్చేందుకు పూర్తి పనులుచేసి సిద్ధంగా ఉన్న సమయంలో ప్రభు త్వం పడిపోయిందన్నారు. ఉచిత కరెంటు తెచ్చామని తెలంగాణ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ ఒక్క విద్యుత్‌ ప్లాంటునైనా ఏర్పాటు చేసింద అని ప్రశించారు. చివరి ఆయకట్టుకు సాగు నీరందించేందకు ఈప్రాంతలో మరో లిఫ్ట్‌ ఏర్పా టు చేస్తామన్నారు. ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, ఎల్‌ రాజ య్య, మినుపాల ప్రకాష్‌రావు,చేతి ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:19:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising