బద్ది పోచమ్మకు బోనం మొక్కులు
ABN, First Publish Date - 2023-02-22T00:42:17+05:30
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న బద్ది పోచమ్మ ఆలయం మంగళవారం భక్తులతో రద్దీగా మారింది.
వేములవాడ టౌన్, ఫిబ్రవరి 21: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న బద్ది పోచమ్మ ఆలయం మంగళవారం భక్తులతో రద్దీగా మారింది. రాజన్న ఆలయానికి సోమవారం పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు రాజన్న దర్శనం చేసుకొని మంగళవారం బద్ది పోచమ్మకు బోనం తీయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనం మొక్కులు సమర్పించేందుకు వచ్చారు. డప్పు చప్పుళ్లు, శివ సత్తుల నృత్యాలు, నెత్తిన బోనాలతో చేసిన నృత్యాలు ఆకటుకున్నాయి. అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్‌లో భక్తులు గంటల తరబడి నిరీక్షించారు. ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి ఒడి బియ్యం, నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం కల్లు సాక పోసి పాడి పంట, పిల్ల పాపలు చల్లగా ఉండాలని వేడుకున్నారు.
Updated Date - 2023-02-22T00:42:23+05:30 IST