అన్నను చంపిన తమ్ముడు
ABN, First Publish Date - 2023-02-17T00:26:49+05:30
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గుండి గ్రామంలో అన్నను గొడ్డలి తో తమ్ముడు నరికి చంపాడు.

రామడుగు, ఫిబ్రవరి 16: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గుండి గ్రామంలో అన్నను గొడ్డలి తో తమ్ముడు నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండి గ్రామా నికి చెందిన గోలె వినోద్(30), హరీష్(28) ఇద్దరు అన్నదమ్ములు. వారు తమ తల్లి యశోదతో కలిసి కూలి పనిచేస్తూ గ్రామంలో జీవిస్తున్నారు. వారికి వివాహం కాలేదు. వినోద్ చేసిన అప్పుల విషయంలో తరచూ అన్నదమ్ములు గొడవ పడేవారు. వినోద్ తల్లిని కూడా హింసిస్తున్నాడు. బుధవారం రాత్రి తల్లి యశోద, తమ్ముడు హరీష్‌తో గొడవపడ్డాడు. అప్పులు తీర్చక పోవడంతో పాటు తమతో గొడవ పడుతున్న వినోద్‌ను హతమార్చాలని హరీష్ నిర్ణయించుకున్నాడు. గురువారం తెల్లవారు జామున యశోద బయటకు వెళ్లిన సమయంలో నిద్రలో ఉన్న వినోద్ తలపై హరీష్ గొడ్డలితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు.అనంతరం హరీష్ ఇంట్లోంచి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు రూరల్ ఏసీపీ కరుణాక ర్‌రావు, సీఐ రవీందర్, ఎస్‌ఐ అంజయ్య సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినోద్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అంజయ్య తెలిపారు.
Updated Date - 2023-02-17T00:26:51+05:30 IST