ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండుతున్న కూరగాయలు

ABN, First Publish Date - 2023-03-17T00:59:15+05:30

కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఏ కూరగాయలు కొనాలన్నా ధరలతో బెంబేలెత్తుతు న్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- బెంబేలెత్తుతున్న పేద, సామాన్య ప్రజలు

- తగ్గిన దిగుబడితో తప్పని ఇక్కట్లు

జగిత్యాల, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఏ కూరగాయలు కొనాలన్నా ధరలతో బెంబేలెత్తుతు న్నారు. గతంలో కిలోకు వెచ్చించిన ధరతో ఇప్పుడు కనీసం పావు కిలో రావడం లేదని వాపోతున్నారు. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీలతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మార్కెట్‌లోకి వెళ్లాలంటే పేద, మద్య తరగతి ప్రజలు ధైర్యం చేయలేని పరిస్థితి ఏర్ప డింది. ఐదు, ఆరు నెలల క్రితం కూరగాయల ధరలు అందుబాటులో ఉ న్నా ఇప్పుడు ఆకాశాన్నంటుతున్నాయి. బెండకాయ, టమాట, పచ్చి మిర్చి, చిక్కుడు, వంకాయ, పాలకూర, దొండకాయ ఇలా ఒకటేమిటి పలు రకాల కూరగాయల ధరలు పెరిగాయి. నిన్న మొన్నటి వరకు కిలో బెండకాయ రూ. 30 నుంచి రూ. 40 వరకు ఉండగా ఇటీవల కిలో బెండకాయ ధర రూ. 80 పలుకుతోంది. వీటితో పాటు నిత్యావసరాల ధరలు కొండెక్కడంతో పేద కుటుంబాలకు మూడు పూటల కూరగాయల భోజనం తాహతుకు మించిన భారంగా మారుతోంది.

తగ్గిన కూరగాయల సాగు..

జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో వివిధ కూరగాయలు సాగవుతు న్నాయి. ఇవి జిల్లా అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. పట్టణాలు గ్రామాల్లో జరిగే వారంతపు సంతలకు వ్యాపారులు ఇతర ప్రాంతాల నుం చి తీసుకువచ్చి కూరగాయలు అమ్ముతున్నారు. సాగు గణనీయంగా తగ్గి పోవడం, ఇతర ప్రాంతాల నుంచి రవాణా చేసుకోవాల్సి రావడంతో ధరలు మండుతున్నాయి. బెండకాయ, వంకాయ, పచ్చిమిర్చి, క్యారెట్‌, కాకర, గోరుచిక్కుడు, బీరకాయ, దొండకాయ, బీన్స్‌ ఏది కోందామన్న రూ. 60 నుంచి 80 వరకు తక్కువ ఎక్కడా దొరకడంలేదు. వారం క్రితం వరకు టమాటలు కేజీ రూ. 10 ఉండగా రూ. 30కి చేరింది. కేజీ రూ.20 ఉన్న పచ్చిమిర్చి ప్రస్తుతం రూ. 60కి చేరింది. కూరగాయల ధరలు భారీగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. నలుగురు ఉన్న కుటుంబం వారం క్రితం కిలో కూరగాయలు కొనగా, ప్రస్తుతం పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. మరి కొందరైతే చారు, పచ్చళ్లతోనే కడుపు నింపుకుంటున్నారు.

కొండెక్కిన ధరలు...

జిల్లాలోని ప్రధాన మార్కెట్‌లో కూరగాయల ధరలు ఆకాశన్నంటుతు న్నాయి. ప్రధానంగా టమాట ధర వింటే ధడ పుడుతోంది. కిలో టమాట రూ. వంద పలుకుతోంది. చిక్కుడు రూ. 80, వంకాయ రూ. 60, బెండకాయ రూ. 80, పచ్చిమిర్చి రూ. 60, బీరకాయ రూ. 80, క్యారెట్‌ రూ. 60, దొండకాయ 60, ఉల్లిగడ్డ రూ. 20, పాలకూర రూ. 60, కొత్తిమీర రూ. 60 పలుకుతోంది. వీటితో పాటు పలు రకాల కాయగూరలు, ఆకు కూరల ధరలు సైతం పెరిగాయి. గత వారం, పది రోజులుగా కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో సామన్య ప్రజలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

తగ్గిన దిగుబడి..పెరిగిన దిగుమతి..

జిల్లాలో రైతులు సాగుచేస్తున్న కూరగాయలు ఎండలకు ఎండిపోవడం దిగుబడులు తగ్గడంతో సరిపోవడం లేదు. రైతులు పండించిన వివిధ ర కాల కూరగాయలు సుమారు పది వేల టన్నులు మాత్రమే దిగుబడి వస్తుంది. ప్రతీ రోజు జిల్లాకు 15 వేల టన్నుల కూరగాయలు అవసర మన్న అంచనాలున్నాయి. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయిక ల్‌ ప్రాంతాలతోపాటు మండలాల్లో జరిగే వారంతపు సంతలకు ఎక్కువగా మహరాష్ట్ర నుంచి 70 శాతం దిగుమతి అవుతున్నాయి. జిల్లాకు నిజామా బాద్‌, ఆదిలాబార్‌, నిర్మల్‌, కామారెడ్డి, హైద్రాబాద్‌ తదితర జిల్లాలనుంచి ఎక్కువగా దిగుమతి చేస్తుండడంతో రవాణా చార్జీలతో కలిపి ధరలు డబు ల్‌ అవుతున్నాయి. బీర, కాకర, సోరకాయ, క్యాప్సికమ్‌, క్యాబేజీ, క్యారెట్‌, క్యాలీప్లవర్‌, తదితరాలు సుమారు అయిదు వేల టన్నులు దిగుమతి అవుతున్నాయి.

ఏం కొనేటట్టు లేదు

- అడిగొప్పుల రజిని, గృహిణి, జగిత్యాల జిల్లా

కూరగాయల ధరలు బాగా పెరిగాయి. రూ. 40 ఉన్న బెండకాయ, బీరకాయ ఇప్పుడు రూ. 80 చెపుతున్నారు. మధ్యతరగతి కుటుంబాల వారికి చాలా కష్టం. అరకిలో పావుకిలోతో సరిపెట్టుకుంటున్నాం. కూరగా యల ధరలు అందరికీ అందుబాటులో ఉండాలి. ధరలు పెరగడం వల్ల సామన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఒక్కసారిగా పెరిగాయి

శంకర్‌, అంబేద్కర్‌ యువజన సంఘ నాయకుడు

ధరలు ఒక్కసారిగా పెరిగాయి. వారం కిందట, ప్రస్తుతం ధరలకు ఎంతో తేడా ఉంది. ఏది కొనాలన్నా రూ. 50పైనే ఉంది. ఇలాగైతే సామా న్యులు బతకడం కష్టమే. కూరగాయల ధరలను నియంత్రించాల్సిన అవస రముంది. కొందరు మద్య వర్తులు అకారణంగా ధరలు పెంచుతున్నారు.

Updated Date - 2023-03-17T00:59:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising