ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మామిడి విషతుల్యం

ABN, First Publish Date - 2023-04-10T01:06:45+05:30

మామిడి పండ్ల సీజన్‌ మొదలైంది. నోరూరించే మామిడి పండ్లను కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతారు. మార్కెట్‌లో మెరుస్తూ కనిపించే పండ్లను రసాయనాలతో మగ్గించడంతో కొత్త రోగాలు తెచ్చుకుంటామనే భయం కూడా వెంటాడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కాల్షియం కార్బైడ్‌తో మగ్గుతున్న పండ్లు

వ్యాధుల బారిన జనం

అధిక ఖర్చుతో ఇథలీన్‌కు దూరం

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల )

మామిడి పండ్ల సీజన్‌ మొదలైంది. నోరూరించే మామిడి పండ్లను కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతారు. మార్కెట్‌లో మెరుస్తూ కనిపించే పండ్లను రసాయనాలతో మగ్గించడంతో కొత్త రోగాలు తెచ్చుకుంటామనే భయం కూడా వెంటాడుతోంది. వ్యాపారుల మధ్య నెలకొన్న పోటీతో మధుర ఫలం విషతుల్యం అవుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మండీలను ఏర్పాటు చేసి కాల్షియం కార్భైడ్‌ వంటి రసాయనాలతో కృత్రిమంగా మాగబెడుతూ జిల్లాలోని వివిధ మండలాలకు సరఫరా చేస్తున్నారు. మరోవైపు ఈ సారి కిలో మామిడి పండ్లు రూ.120 ధర పలుకుతున్నాయి.

కృత్రిమంగా పండుతున్న మామిడి

తియ్యని పండ్ల వెనక విషతుల్యం దాగి ఉంది. వివిధ ప్రాంతాల నుంచి మామిడి కాయలను దిగుమతి చేసుకొని రసాయనాలతో మాగబెడుతున్నారు. జిల్లాలో ఆహార భద్రత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మామిడి పండ్లే కాకుండా ఇతర పండ్లను కూడా కృతిమ పద్ధతుల్లోనే మాగబెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. సిరిసిల్లలోని చుట్టుపక్కల మామిడి తోటల నుంచి వ్యాపారులు గుత్తగా మామిడి కాయలను తీసుకొచ్చి నిషేధిత కార్భైడ్‌ రసాయనాలను వాడుతూ పండ్లను మాగబెడుతున్నారు. మిలమిల మెరుస్తూ ఉండడంతో ఎక్కువ ధరకు అమ్మకాలు సాగిస్తున్నారు. కార్భైడ్‌ ఇతర రసాయనాలతో మాగబెట్టిన పండ్లు తినడంతో అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అల్సర్‌, కాలేయం, క్యాన్సర్‌, గొంతునొప్పి, రక్తహీనత, కిడ్నీ, నరాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు. కార్బైడ్‌ వంటి రసాయనాలతో పండించిన మామిడి అనారోగ్యానికి కారణమవుతుండడంతో గతంలో ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు వాటిని నిషేధించింది.

ఇథలీన్‌ గ్యాస్‌పై అవగాహన కరువు

కాల్షియం కార్భైడ్‌ రసాయనం వినియోగించడాన్ని 2012 మార్చిలోనే అప్పటి ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు నిషేధిచింది. నిషేధం ఉన్నా వాడకం మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు కచ్చితంగా ఉన్నా ఆహార కల్తీ నిరోధక శాఖలు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. నిషేధిత కాల్షియం కార్భైడ్‌ సరఫరా జరుగుతున్నా రైతుల్లో కూడా అవగాహన కల్పించడంలేదు. కాల్షియం కార్భైడ్‌కు బదులు ఇథలీన్‌ గ్యాస్‌ ద్వారా పండ్లను మాగబెడితే ఆరోగ్యకరమని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. మాగబెట్టే గదులను ఉపయోగించాలని తెలిపింది. ఇందు కోసం రైఫనింగ్‌ చాంబర్‌ల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రాయితీ కూడా కల్పిస్తోంది. కానీ ఇథలీన్‌ వాడకం రైఫనింగ్‌ చాంబర్‌ల ఏర్పాటుపై అధికారులు అవగాహన కల్పించడం లేదు. రైఫనింగ్‌ చాంబర్‌ ద్వారా ఇథలీన్‌ గ్యాస్‌ను వదిలి పండ్లను మూడు రోజులపాటు మాగబెడతారు. దీంతోపండ్లు సహజ సిద్ధంగా మాగినట్లు ఉంటాయి. మంచి రంగుతోపాటు రుచీ ఉంటుంది. ఇథలీన్‌ గ్యాస్‌తో ఖర్చు పెరుగుతుందని ఉపయోగించడం లేదని తెలుస్తోంది.

మాగబెట్టిన పండ్లను ఇలా గుర్తించండి

మామిడి కాయలను కార్భైడ్‌ ద్వారా మాగబెట్టి, రంగు మార్చి యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. వీటిని గుర్తించడానికి నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. కార్భైడ్‌తో మాగబెట్టిన మామిడి పండ్లపై ఆకుపచ్చని మచ్చలు ఉంటాయి. పసుపు వర్ణం ఎక్కువగా ఉంటుంది. ఈ పండు తినే సమయంలో నోట్లో కొంచెం మంట కూడా ఉంటుంది. కడుపులో నొప్పి, గొంతు నోప్పి, డయేరియా ఉంటే కార్భైడ్‌ వాడినట్లుగా గుర్తించవచ్చు. సహజ సిద్ధంగా మాగితే ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు కలిసినట్టుగా ఉంటాయి. పండును కోసినపుడు గుజ్జు ఎరుపు, పసుపు కలిసినట్టుగా ఉంటుంది. పండ్లలో రసం ఎక్కువగా ఉంటుంది. తొడిమ లోపటికి కుంగినట్లుగా ఉంటుంది.

పండ్ల తొక్కతీస్తే మంచిది

పండ్లను తినేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. శుభ్రంగా మంచినీటితో కడగాలి. ఉప్పుతో కలిపిన నీటితో కడగడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు పండ్ల తొక్కను తీసి తినడంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.

Updated Date - 2023-04-10T01:06:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising