చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి
ABN, First Publish Date - 2023-02-25T00:15:05+05:30
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని ఎంపీపీ రేణుక అన్నారు.
ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 24: చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని ఎంపీపీ రేణుక అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం అల్మాస్‌పూర్‌లో చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బానిసత్వాన్ని బద్దలు కొట్టి సమాజానికి చైతన్యం అందించిన వీరనారిమని ఐలమ్మ అని కొనియాడారు. గ్రామంలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పుష్పల, ఉప సర్పంచ్ బాలయ్య, నాయకులు భూపతి, కిష్టయ్య, అనంతరెడ్డి, కృష్ణహరి, వెంకటరెడ్డి, కమలాకర్, సత్తయ్య పాల్గొన్నారు.
Updated Date - 2023-02-25T00:15:12+05:30 IST