బీర్‌తో చిల్..
ABN, First Publish Date - 2023-06-01T23:38:12+05:30
భానుడు ప్రచండుడై తన ప్రతాపాన్ని చూపిస్తుంటే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు ప్రజలు తట్టుకోలేక పోతున్నారు. మద్యం ప్రియులకు కూడా ఎండ వేడి తాకింది.
- వేసవి తాపంతో పెరిగిన అమ్మకాలు
కరీంనగర్ క్రైం, జూన్ 1: భానుడు ప్రచండుడై తన ప్రతాపాన్ని చూపిస్తుంటే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు ప్రజలు తట్టుకోలేక పోతున్నారు. మద్యం ప్రియులకు కూడా ఎండ వేడి తాకింది. బ్రాందీ, విస్కీలను సేవించే మందుబాబులు వేసవిలో వాటికి స్వస్తి చెప్పి బీరు వైపు మళ్లుతున్నారు. దీంతో ఒక్కసారిగా బీరు అమ్మకాలు పెరిగాయి. జిల్లాలో 2023 సంవత్సరంలో మే నెలలో రికార్డు స్థాయిలో 50.22 కోట్ల రూపాయల బీరు అమ్మకాలు జరిగాయి. జిల్లాలోని మద్యం ప్రియులు రోజుకు కోటి 62 లక్షలపైగా బీరు తాగేశారు. జిల్లాలో సాధారణంగా నెలకు లక్షా 25 వేల పెట్టెల బీరు అమ్మకాలు జరుగుతుంటాయి. మే నెలలో విపరీతమైన ఎండల కారణంగా 2, 28,288 పెట్టెల బీరు అమ్మకాలు జరిగాయి. ఒక్కో పెట్టె (12 బీర్లు) విలువ 2,200 రూపాయలుంటుంది. వీటి విలువ 50 కోట్ల 22 లక్షల 33 వేల 600 రూపాయలు. 2022 మే నెలలో 2 లక్షల 17 వేల 842 పెట్టెల బీరు అమ్మకాలు జరిగాయి. వీటి విలువ 47 కోట్ల 92 లక్షల 52 వేల 400 రూపాయలు. గత ఏడాదికంటే ఈ సంవత్సరం మే నెలలో 2 కోట్ల 29 లక్షల 81 వేల 200 రూపాయల బీరు అమ్మకాలు పెరిగాయి.
జిల్లాలోని ఎక్సైజ్ సర్కిళ్ల వారీగా మద్యం అమ్మకాలు
ఎక్సైజ్ స్టేషన్ వైన్స్ బార్ బీరు (పెట్టెలు)
కరీంనగర్ అర్బన్ 21 24 71,125
కరీంనగర్ రూరల్ 26 2 60,692
తిమ్మాపూర్ 14 1 30,842
హుజురాబాద్ 17 3 32,533
జమ్మికుంట 16 3 33,096
మొత్తం 94 33 2,28,288
Updated Date - 2023-06-01T23:38:12+05:30 IST