ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థుల మాటలు నమ్మకండి

ABN, First Publish Date - 2023-11-29T00:20:53+05:30

ఉన్నత ఉద్యోగాన్ని, భవిష్యత్తును వదిలి ప్ర జా సేవకు వచ్చానని, కానీ కేవలం అధికార కాంక్షతోనే ప్రజలను మోసం చేయాలని చూస్తున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థుల మోసపుమాటలు నమ్మ వద్దని, బీసీ బిడ్డనైన తనను అశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని పెద్దపల్లి బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉష ఓటర్లను అభ్యర్థించారు.

సుల్తానాబాద్‌, నవంబరు 28: ఉన్నత ఉద్యోగాన్ని, భవిష్యత్తును వదిలి ప్ర జా సేవకు వచ్చానని, కానీ కేవలం అధికార కాంక్షతోనే ప్రజలను మోసం చేయాలని చూస్తున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థుల మోసపుమాటలు నమ్మ వద్దని, బీసీ బిడ్డనైన తనను అశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని పెద్దపల్లి బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉష ఓటర్లను అభ్యర్థించారు. సుల్తానాబాద్‌ పట్టణం లోని ప్రధాన వీధుల గుండా మంగళవారం పెద్దఎత్తున మహిళలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని రేగడిమద్దికుంట, నీరుకుళ్ల తదితర గ్రామాల్లో కూడా పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సంద ర్భంగా ఇంటింటికీ తిరుగుతూ బీఎస్పీ అధికారంలోకి వచ్చాక అమలు చేసే సంక్షేమ పథకాల గురించి ఇచ్చే హామీల గురించి ప్రజలకు వివరించారు. సుల్తానాబాద్‌ పట్టణంలో, పలు గ్రామాలలో ప్రజలను ఉద్ధేశించి దాసరి ఉష మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులు కేవలం తమ వ్యాపారా ల కోసం, అధికారం అనుభవించడానికే రాజకీయాలలోకి వచ్చారని, తాను మాత్రం ఉన్నత ఉద్యోగాన్ని, ఉన్నతమైన భవిష్యత్తును వదులుకొని కేవలం ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తనను ఎమ్మెల్యే గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈర్ల కొమురయ్య, తోట వెంకటేశ్‌ పటేల్‌, కలీం, రాహుల్‌ రంజిత్‌, చంద్రశేఖర్‌, మధు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:21:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising