ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు..

ABN, First Publish Date - 2023-06-23T00:05:04+05:30

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూరాబాద్‌, జూన్‌ 22: వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం హుజూరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్‌లో అమరవీరుల స్తూపాన్ని నిజమైన ఉద్యమకారులందరూ కలిసి కట్టుకున్నారని, ఆ స్తూపం వద్ద అమరులకు ప్రతి సంవత్సరం నివాళులర్పించే వారమన్నారు. ఒక సైకో కొత్తగా అమరవీరుల స్తూపం కట్టించాడన్నారు. మానకోటలో ఉద్యమకారులపై రాళ్లు వేసి... రక్తం కన్ను చూసి... వారితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి ఆ స్తూపాన్ని ప్రారంభించడం సిగ్గు చేటన్నారు. ఇదంతా నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారన్నారు. తాను ఇంటింటా బీజేపీ కార్యక్రమంలో పాల్గొనేదనే ప్రచారంలో వాస్తవం లేదని, హుస్నాబాద్‌లో ఇంటింటా బీజేపీ కార్యక్రమంలో తాను పాల్గొనన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం మాత్రమేనని, కట్టు కథలు నమ్మొద్దన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు ముఖ్యమంత్రి కట్టాడని హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని అధికార పార్టీకి చెందిన ఓ సైకో అంటున్నాడని, ప్రజలు కట్టిన పన్నులతోనే 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉండేందుకు ప్రభుత్వ డబ్బులతో కట్టించారన్నారు. ప్రగతి భవన్‌ కూడా ప్రజల సొమ్ముతోనే కట్టారనే విషయం మర్చిపోవద్దన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులపై ప్రజలు ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలు రోజు రోజుకు దిగజారుతున్నాయని, దీనిపై సీపీ దృష్టి పెట్టాలన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకం పూర్తి స్థాయిలో రాలేదని, దీనిపై సైకో కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ హుజూరాబాద్‌కు చర్చకు రావాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీసీలు గుర్తుకు వస్తారన్నారు. బీసీల్లోని అందరికి లక్ష రూపాయల సాయం అందజేయాలన్నారు. దశాబ్ది ఉత్సవాలకు వంద కోట్లు కేటాయిస్తే మరో వంద కోట్లు ఖర్చు పెట్టి తాగి సంబరాలు చేసుకుంటున్నారన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి, ఎర్రబెల్లి సంపత్‌రావు, మాడ గౌతమ్‌రెడ్డి, నేరేళ్ల మహేందర్‌గౌడ్‌, సాంబయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-06-23T00:05:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising