రాష్ట్రంలో 90వేల మంది రజకులకు ఉపాధి
ABN, First Publish Date - 2023-08-07T01:03:17+05:30
రాష్ట్రంలోని దాదాపు 90 వేల మంది రజకులకు నెలకు 250 యూనిట్లు ఉచి తంగా అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపాధి కల్పిస్తున్నారని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 6: రాష్ట్రంలోని దాదాపు 90 వేల మంది రజకులకు నెలకు 250 యూనిట్లు ఉచి తంగా అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపాధి కల్పిస్తున్నారని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. ఆదివారం సిరిసిల్ల పట్టణంలో మడేలఎల్లయ్య దేవాల యం ఆవరణలో రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆక్కరాజు శ్రీనివాస్ అధ్యక్షతన సిరిసిల్ల పట్టణ రజక సంఘం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార మహో త్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బసవరాజు సారాయ్య మాట్లాడుతూ సిరిసిల్లలో చిట్యాల ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ హామీ ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య మంత్రి కేసీఆర్ కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలను అందిస్తున్నారన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో దోబీఘాట్ మంజూరుతోపాటు రాష్ట్రంలో ఉన్న 140 మున్సిపాల్టీల్లోనూ ఆధునిక దోబీఘాట్‌లను మంజూరు చేసి మంత్రి కేటీఆర్ ప్రజల మన్ననలు అందుకుంటున్నారన్నారు. ఒక్కో మున్సి పాల్టీలో రూ.2 కోట్ల నిధులతో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. దేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వమూ ఆధునిక దోబీఘాట్లు ఇవ్వలేదన్నారు. దేశ వ్యాప్తంగా కుల వృత్తులను గుర్తించిన వారిలో కేసీఆర్, కేటీఆర్ మాత్రమే అన్నారు. కులవృత్తులను ప్రోత్సహిస్తూనే బడుగు బలహీన వర్గాలకు కూడా విద్యనందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గురు కులాలు, రెసిడెన్సియల్ పాఠశాలలను ఏర్పాటు చేశారన్నారు. జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడారు. వృత్తిని నమ్ముకున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంక్షేమ పథ కాలను అందిస్తున్నారన్నారు. అనంతరం సినీ నటుడు సదానందం మాట్లాడుతూ ప్రతీ మనిషి రోజుకు ఒక పది నిమిషాలు నవ్వాలన్నారు. ప్రస్తుత సమాజంలో మనిషి జీవితం యాంత్రికమైందన్నారు. అనంతరం ముఖ్య అతిథుల సమక్షంలో రజక సంఘం పట్టణ అధ్యక్షుడు దండు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు వేముల వాడ బాలయ్య, ప్రధాన కార్యదర్శి కాసర్ల మహేందర్, ఉపాధ్యక్షులు మారుపాక పెద్ద శ్రీనివాస్, కాసర్ల శ్రీనివాస్, కాసర్ల వెంకటేష్, పోతురాజు గౌరయ్య, కోశాధికారి బండి శ్రీనివాస్, ప్రచారం కార్యదర్శి కాసర్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి చెప్యాల మధుసూదన్ కార్యవర్గ సభ్యులు ప్రమాణాస్వీకారం చేశారు. అనంతరం ముఖ్య అతిథులను రజక సంఘం రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు సన్మానించారు. బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుబ్బాక రమేష్, పట్టణ లాండ్రీ అసోసియేషన్, పట్టణ దోబీఘాట్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-07T01:03:17+05:30 IST