ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ధరణి’తో ఇబ్బందులు పడుతున్న రైతులు

ABN, First Publish Date - 2023-02-28T00:14:53+05:30

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ తో సామాన్య రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆరోపించారు.

స్థానికులతో మాట్లాడుతున్న విజయరమణారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు

జూలపల్లి, పిబ్రవరి 27: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ తో సామాన్య రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆరోపించారు. మండలంలోని కోనరావుపేట, పెద్దాపూర్‌ గ్రామాల్లో హాత్‌సే హాత్‌ జోడో యాత్రలో భా గంగా గడపగడపకు కాంగ్రెస్‌పార్టీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కష్టాలను అడి గి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ పెద్దాపూర్‌, కోనరావుపేట గ్రామాల్లో గతంలో తాను చేసిన రోడ్లు, అభివృద్ధి పనులు తప్పా ప్రస్తుత ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనులు కనిపించడం లేదని విమర్శించారు. దళితులకు దళితబంధు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారిని మోసం చేస్తున్నారన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ను నిధులను ప్రభుత్వం పక్కదారి ప ట్టించిదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఏఒక్క వర్గం ప్రజలు సంతోషంగా లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నా యకులు అర్షనపల్లి వెంకటేశ్వర్‌రావు, కోరుకంటి వెంకటేశ్వర్‌రావు, కొంపె ల్లి స్వామి, అమరగాని లింగయ్యగౌడ్‌, పెసరు లక్ష్మణ్‌, మాంకాలి అంజ య్య, మెతుకు కాంతయ్య, బొజ్జ శ్రీనివాస్‌, బొట్ల వెంకటేశం, జనుప తిరు పతి, ఈర్ల స్వామి, కనకట్ల నర్సింగం, చెరుకు కనుకయ్య, పాలిటి రవి, పెసర స్వామి, చొక్కయ్య, రాజారాంరెడ్డి, అమ్ముల రాయమల్లు, కుమార్‌, చొప్పరి అనిల్‌, కనుకయ్య, యూసఫ్‌, మొండయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-02-28T00:14:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!