ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

ABN, First Publish Date - 2023-01-02T23:40:49+05:30

జిల్లా వ్యాప్తంగా సోమవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
. గోదావరిఖని కోదండ రామాలయంలో దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెల్లవారుజాము నుంచే సందడి

ఉత్తర ద్వార దర్శనం కోసం ఏర్పాట్లు

ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు

వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

పెద్దపల్లి రూరల్‌, జనవరి 2: జిల్లా వ్యాప్తంగా సోమవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పెద్దపల్లి మండలంలోని పలు ఆలయాల్లో సోమవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దకల్వల క్యాంపు లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ వేద పండితులు భాష్యం రంగాచార్యులు, పవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో స్వామికి మహా క్షీరాభిషేకాలు, నివేదన, మంత్ర పుష్పాలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పల్లకిసేవలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ బోంకూరి శంకర్‌, ప్రధాన కార్యదర్శి రాజనరేందర్‌గౌడ్‌, ఆర్డీవో వెంకట మాధవరావు, తహసీల్దార్‌లు సుధా కర్‌, శ్రీనివాస్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ మాధవి, మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సుల్తానాబాద్‌: వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి పర్వదినోత్సవాన్ని భక్తులు వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలోని ప్రముఖ వేణు గోపాల స్వామి ఆలయాన్ని చైర్మన్‌ పల్లా మురళి సదాలక్ష్మి దంప తులు ఆధ్వర్యంలో ముస్తాబు చేశారు. భక్తుడు పొదిళ్ల రమేశ్‌ ప్రతీ ముక్కోటి ఏకాదశి రోజున ఆలయానికి పుష్ప కంకైర్యం చేస్తున్న కా రణంగా ఆలయ ద్వారాలను అందంగా అలంకరించారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో ఆలయ ప్రాంగణంలో పల్లకిలో ఊరేగించారు. అర్చకులు సౌమిత్ర శ్రావణ్‌ ప్రవచించారు. లోక్‌ ఆదాలత్‌ సభ్యుడు పల్లా కిషన్‌ తేనీటిని ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్‌ పల్లా మురళి సదాలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమ్లు సుశీల, ఎంపీపీ బాలాజీ రావు స్వరూప, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ముత్యం సునిత, వైస్‌ చైర్మన్‌ బిరుదు సమత, పుర ప్రముఖులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో వికాస తరంగిణి బాధ్యులు సాదుల భాస్కర్‌ లత, డైరక్టర్‌ జలజ, రాజమణి జయమ్మ నారాయణరావు, పొదిళ్ల రమేశ్‌, రవి, తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన 24 గంటల భజన కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్‌ పల్లా మురళి సదాలక్ష్మి, అర్చకులు సౌమిత్ర శ్రావణ్‌ - హరిణి దంపతులు ప్రారంభించారు. కొమురవెళ్లి శ్రీలత, నగునూరి లక్ష్మి, వంగల స్రవంతి, మంజుల, దీప, తదితర భక్త బృందాలతో భజన, హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కాగా నీరుకుళ్లలోని మానేటి రంగనాయక స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గజ వాహనంతో సహా పలు వాహనాల పై స్వామి వారిని, హంస వాహనం పై ఆండాళ్‌ అ మ్మ వారిని ఊరేగించారు. సర్పంచ్‌ కోటగిరి విజేందర్‌తో పాటు ఆలయ ప్రదాన అర్చకులు గోవర్థనగిరి మనోహరా చార్యులు. రాజ్‌కు మారాచార్యులు, వీరయ్య అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఐతరా జపల్లి సీతారామచంద్ర స్వామి వారి అలయంలో జరిగిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ప్రత్యేక పూజలు చేశారు.

ధర్మారం: మండల కేంద్రంలోని శ్రీసీతారామాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్‌పర్సన్‌, జడ్పీటీసీ సభ్యురాలు పూస్కూరి పద్మజ, సర్పంచ్‌ జితెందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కోల్‌సిటీటౌన్‌: గోదావరిఖనిలో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు సోమవారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. వైష్ణవాలయాల్లో స్వామివారిని ఉత్తర ద్వారంగా దర్శనానికి ఏర్పాట్లు చేయగా భక్తులు దర్శించుకున్నారు. స్థానిక కోదండ రామాలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అర్చనలు, పూజలు చేశారు. ఆలయ ప్రధానఅర్చకులు మధుసూధనాచార్యులు, అర్చకులు గిరిధరాచార్యులు, శశిధరాచార్యులు మంత్రోచ్ఛరణల ఽమధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణ్‌నగర్‌లోని లక్ష్మీనారాయణస్వామి ఆలయం, తిలక్‌నగర్‌లోని సత్యనారాయణస్వామి ఆలయం, బస్‌డిపో సమీపంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, గంగానగర్‌లోని గోదారంగనాయకస్వామి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పూజలు నిర్వహించారు. కాగా కోదండ రామాలయంలో రామగుండం నియోజకవర్గ నాయకులు మక్కాన్‌ సింగ్‌రాజ్‌ఠాకూర్‌-మనాలి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

మంథని: స్థానిక శ్రీలక్ష్మినారాయణస్వామి, శ్రీమంత్రకూట గోపి జన వల్లభ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా సాగాయి. తెల్లవారుజామునుంచే భక్తులు స్వామి, అమ్మవార్లను ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో ఆలయాలకు తరలి వచ్చా రు. ఆలయ అవరణలో ఏర్పాటు చేసిన అన్నమాచార్య సంక్తీరనల హరిలో ప్రముఖ గాయకులు రావికంటి మనోహర్‌, నరహరి, గట్టు మాధవి, గాయకులు పాడిన ఆధ్యాత్మిక పాటలు భక్తులను భక్తిపా రవశ్యంలో ముచ్చెత్తాయి. శ్రీమహాగణపతి, శ్రీసీలేశ్వర-సిద్ధేశ్వర, శ్రీఓం కారేశ్వర, శ్రీభిక్షేశ్వర, శ్రీఅయ్యప్పస్వామి, శ్రీదత్తా, అమ్మవారి ఆలయాల్లో సైతం భక్తులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్టశైలజ తోపాటు అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ కనిపించింది.

కమాన్‌పూర్‌: మండల కేంద్రంలోని ఆదివరహాస్వామి ఆలయంలో స్వామి వారు ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు దర్శన ఇచ్చారు. మండలంలోని ఆలయాల్లో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

Updated Date - 2023-01-02T23:40:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising